మళ్లీ ఎన్నికలకు 'మహా' బీజేపీ సిద్ధం.. సేనతో తెగతెంపులే
09-11-201909-11-2019 08:53:07 IST
2019-11-09T03:23:07.525Z09-11-2019 2019-11-09T03:22:58.043Z - - 14-04-2021

మహారాష్ట్రలో మరో ఆరునెలల్లో తాజాగా సొంతంగా ఎన్నికలకు వెళ్లడానికే బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఏర్పాటులో జరుగుతున్న ప్రతిష్టంభనకు శివసేనే కారణమంటూ ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడనవీస్ రాజీనామా చేసిన కొన్ని గంటల్లోపే బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరుపక్షాల మధ్య శుక్రవారం పొడవునా నడిచిన విమర్శలు, ప్రతివిమర్శలు, దూషణ భూషణల క్రమంలో శివసేన, బీజేపీ ఇక కలిసి పని చేసే పరిస్థితి పూర్తిగా మూసుకుపోయింది. పొత్తు చెదిరిపోవడానికి మీరు కారణమంటే మీరు కారణమంటూ ఆడిపోసుకున్న మహారాష్ట్ర బీజేపీ, శివసేన అగ్రనాయకత్వం మళ్లీ ఎన్నికల ద్వారానే బలాబలాలు తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు పక్షం రోజులు గడచినా.. ప్రభుత్వ ఏర్పాటులో మెజారిటీ సాధించిన బీజేపీ, శివసేనల మధ్య అధికార పంపిణీ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ‘ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే కొత్త ప్రభుత్వం కొలువుతీరడం కావచ్చు లేదా రాష్ట్రపతి పాలన విధించడం కావచ్చు’ అని రాజీనామా అనంతరం ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యానికి శివసేన తీరే కారణమని విమర్శించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని సమంగా పంచుకోవాలని తన సమక్షంలో శివసేనతో ఎలాంటి అంగీకారం కుదరలేదని ఫడ్నవీస్ మరోసారి స్పష్టం చేశారు. ‘బీజేపీతో కాకుండా ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్న శివసేన పాలసీ సరైంది కాదు’ అని వ్యాఖ్యానించారు. కాగా మరోవైపున కేంద్రమంత్రి రామ్‌దాస్ అఠవాలే శుక్రవారం శరద్‌పవార్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. మరోవైపున శివసేన కూడా తక్కువేం తినలేదు. శివసేన పట్టుబడుతున్న 50-50 ఫార్ములా గురించి తనకు తెలియదంటూ దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలపై శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే మండిప్డడారు. ఫడ్నవిస్ చెప్పినవన్నీ అబద్ధాలేనని, ఆయన వ్యాఖ్యలు తనను దిగ్భ్రాంతి కలిగించాయని అన్నారు. 50-50 ఫార్ములాపై చర్చల్లో ఫడ్నవిస్ కూడా పాల్గొన్నారని ఉద్ధవ్ వెల్లడించారు. బీజేపేనే తమ ముందు మోకరిల్లాలి కానీ, శివసేన వెనక్కి తగ్గదని చెప్పారు. ధాని మోదీపై తాము చేసినన్ని ఆరోపణలను కాంగ్రెస్ కూడా చేయలేదని ఫడ్నవిస్ చెప్పడం కూడా అబద్ధమేనని అన్నారు. మోదీపై కానీ, అమిత్‌షాపై కానీ తామెప్పుడూ వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదని ఉద్ధవ్ చెప్పారు. బీజేపీ ఇంత దిగజారుడుకు పాల్పడుతుందని అనుకోలేదన్నారు. ఆర్ఎస్ఎస్పై తమకు ఎంతో గౌరవం ఉందని, అబద్ధాలు ఎవరు చెప్పారో ఆర్ఎస్ఎస్ తేల్చుకోవాలన్నారు. రాముడు పేరు చెబుతూ అబద్ధాలు మాట్లాడటం బీజేపీకే చెల్లిందన్నారు. తనను అబద్ధాల కోరు అని బీజేపీ నిందిస్తున్నట్లయితే ఇక ఆ పార్టీతో ఎన్నడూ సంబంధం పెట్టుకోనని ఉద్ధవ్ తేల్చి చెప్పారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
4 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
4 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
4 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
8 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
9 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
8 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
10 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
10 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
6 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
12 hours ago
ఇంకా