newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మరో సంచలనానికి నాంది పలికిన యోగి ఆదిత్యనాథ్..

14-09-202014-09-2020 17:03:10 IST
2020-09-14T11:33:10.976Z14-09-2020 2020-09-14T11:33:07.107Z - - 20-04-2021

మరో సంచలనానికి నాంది పలికిన యోగి ఆదిత్యనాథ్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ స్పెషల్ పోలీసు ఫోర్స్ ను వారి రాష్ట్రంలో తీసుకుని వచ్చారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు ఎటువంటి అధికారాలు ఉంటాయో అలాంటి తరహాలోనే ఉత్తర ప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ కు కూడా అధికారాలను ఇచ్చారు. వారెంట్ లేకుండానే సెర్చ్ చేసి, అరెస్టు చేయనున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  

ఉత్తర ప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ బృందం సభ్యులు కోర్టులను, ఎయిర్ పోర్టులను, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగులను, మెట్రోలు, బ్యాంకులు, మిగిలిన ప్రభుత్వ ఆఫీసులను పరిరక్షించనున్నారు. ఉత్తర ప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ లో మొత్తం ఎనిమిది బెటాలియన్లు ఉండనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం 1,747.06 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఇది యూపీ పోలీసు విభాగంలో ప్రత్యేక యూనిట్ గా పని చేయనుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదని అడిషనల్ ఛీఫ్ సెక్రెటరీ అవనీష్ అవస్థి తెలిపారు.  

ఉత్తర ప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ సభ్యుడు ఎవరైనా కానీ మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే అరెస్టు చేసే హక్కులు ఉండనున్నాయి. ఇలాంటి పవర్ ఇవ్వడం వలన కొందరు వాటిని సరిగా వినియోగించుకోలేకపోవచ్చని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కొన్ని పొరపాట్ల కారణంగా ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని సూచిస్తూ ఉన్నారు. ఈ విమర్శలకు ప్రభుత్వం సమాధానం అయితే చెప్పడం లేదు కానీ.. సిఐఎస్ఎఫ్ కు ఎలాంటి అధికారాలు ఉంటాయో ఉత్తర ప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ కు అధికారాలు ఉంటాయని చెబుతూ ఉన్నారు.

ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నా.. హింసాత్మక ఘటనలకు కారణమవుతూ ఉన్నా వారిని వెంటనే అదుపులోకి తీసుకునే అధికారాలు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు ఉంటుంది. ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. క్రిమినల్స్ మీద ఉక్కు పాదం మోపడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే  ఉత్తర ప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ను తీసుకుని వచ్చారు.   

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   12 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   16 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   17 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   13 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   20 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   12 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   14 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle