newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మరో లాక్ డౌన్ తప్పదా.. మంత్రులు అధికారులతో మోదీ సమీక్ష

15-06-202015-06-2020 06:35:08 IST
Updated On 15-06-2020 10:09:14 ISTUpdated On 15-06-20202020-06-15T01:05:08.353Z15-06-2020 2020-06-15T01:05:05.385Z - 2020-06-15T04:39:14.889Z - 15-06-2020

మరో లాక్ డౌన్ తప్పదా.. మంత్రులు అధికారులతో మోదీ సమీక్ష
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కేసుల  సంఖ్య రానురానూ పెరుగుతూ శనివారం నాటికి దేశంలో 3 లక్షల కరోనా కేసులు నమోదవడంతో కేంద్రప్రభుత్వ వర్గాల్లో అలజడి మొదలైంది. దేశంలో కరోనావైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీనియర్‌ మంత్రులతో సమీక్ష నిర్వహించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్‌ షా, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కరోనావైరస్‌ వ్యాప్తిపై చర్చించారు. ఐదు రాష్ట్రాల నుంచే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ప్రధాని మోదీకి తెలిపారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు టెస్టులు, బెడ్‌ల సంఖ్య పెంచాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రధాని సూచించారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రులతో సమావేశానికి ముందుగా కేంద్ర సీనియర్‌ మంత్రులు, ఉన్నతాధికారులతో శనివారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. అత్యధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ నెల 16, 17వ తేదీల్లో సీఎంలతో సమావేశం అనంతరం ప్రధాని మరో దఫా అత్యంత కీలకమైన కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.

ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రులను ఆదేశించారు. దీంతో ఈ నెల 14 (ఆదివారం)న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో హోంమంత్రి అమిషా భేటీ కానున్నారు. కాగా, ఈ నెల 16, 17 వ తేదీల్లో ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కోవిడ్‌, లాక్‌డౌన్‌ పరిస్థితులపై వీడియో కాన్ఫిరెన్స్‌ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 

వర్షాకాలం నేపథ్యంలో కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నందున రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చించి యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించి, చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని ప్రధాని ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న రీత్యా రాబోయే రెండు నెలల్లో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. 

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌, సీఎం, కేంద్ర, రాష్ట్ర, మునిసిపాలిటీ అధికారులతో తక్షణం సమావేశమై సమగ్రమైన, సమన్వయంతో కూడిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌తో పాటు ప్రధానమంత్రి ప్రిన్సిపల్‌ కార్యదర్శి, కేబినెట్‌ సెక్రటరీ, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌, సాధికారిక బృందాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

దేశంలో ప్రస్తుత పరిస్థితి, సమీప భవిష్యత్తులో కరోనా స్థితిగతులపై వైద్య అత్యవసర నిర్వహణకు చెందిన సాధికారిక బృందం కన్వీనర్‌, నీతిఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వినోద్‌ పాల్‌ వివరించారు. పెద్ద నగరాల్లో పరీక్షా సదుపాయాలు, పడకలు, సేవలను పెంచి సమర్థంగా కరోనాను ఎదుర్కోక తప్పదని ఆయన సూచించినట్లు సమాచారం. 

కాగా నగరాలు, జిల్లా స్థాయి నుంచి ఆస్పత్రులు, పడకలకు సంబంధించిన సౌకర్యాలపై సాధికారిక బృందం చేసిన సిపారసులను ప్రధాని పరిశీలించినట్లు తెలిసింది. కొవిడ్‌ నియంత్రణలో అనేక రాష్ట్రాలు సమర్థంగా చర్యలు తీసుకున్నాయని మోదీ ప్రశంసించారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌లలో ఆందోళనకర పరిస్థితి నెలకొందని, మూడింట రెండొంతుల కేసులు ఈ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని ప్రధానికి అధికారులు వివరించారు. 

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నించినా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతూ పోతున్నందున జూన్, లేక జూలైవరకు ప్రధాని నరేంద్రమోదీ వైరస్ ప్రబలంగా ఉంటున్న కొన్ని కీలక నగరాల్లో మళ్లీ లౌక్ డౌన్‌ని కఠినంగా అమలు చేయవచ్చని భావిస్తున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle