newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మరో అంతర్జాతీయ ఉగ్రవాది

17-07-202017-07-2020 12:09:07 IST
2020-07-17T06:39:07.808Z17-07-2020 2020-07-17T06:39:05.400Z - - 12-04-2021

మరో అంతర్జాతీయ ఉగ్రవాది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాకిస్థాన్‌కు చెందిన మరో తీవ్రవాద సంస్థ నేత అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంటూ ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ నేత ముఫ్తీ నూర్ వాలీ మెహసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంటూ ఐరాస భద్రత మండలి ఆంక్షల కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది. 

తీర్మానం 2368(2017)లో 2, 4 పేరాల్లో అల్-ఖైదాతో అనుబంధ సంస్థ తరపున లేదా మద్దతుతో ఉగ్రవాదులకు నిధులు, ప్రణాళిక, సౌకర్యాలు, కార్యకలాపాలకు పాల్పడినట్టు పేర్కొంది. ఐరాస భద్రతా మండలి నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. గతేడాది లష్కరే తొయిబా చీఫ్ మసూర్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించింది.

తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ నేత నూర్ వాలీ మెహసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడాన్ని స్వాగతిస్తున్నాం.. పాకిస్థాన్‌లో అనేక భయంకర ఉగ్రదాడుల వెనుక టీటీపీ హస్తం ఉంది.. నూర్ వలీని ఉగ్రవాదిగా పేర్కొంటూ 2019 సెప్టెంబరులోనే తాము నిషేధించామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు ట్వీట్ చేశారు.

పాక్ తాలిబన్‌గా గుర్తింపు పొందిన టీటీపీ.. పలు ఆత్మాహుతి దాడులకు పాల్పడి వందలాది మంది మరణానికి కారణమయ్యింది. టీటీపీని ఇంతకు ముందు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్.. ప్రత్యేక అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది.

టీటీపీ నేత ముల్లాహ్ ఫజల్లూహ్ చనిపోయిన తర్వాత 2018 జూన్‌లో అతడి స్థానంలో ముఫ్తీ నూర్ వలీ మోహసూద్ బాధ్యతలు చేపట్టాడు. నూర్ వలీ నాయకత్వంలో అనేక ఉగ్రదాడులు పాకిస్థాన్‌లో జరిగినట్టు అమెరికా నివేదిక తెలిపింది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle