మమత, మాయా కోరిక నెరవేరుతుందా?
11-05-201911-05-2019 07:43:08 IST
2019-05-11T02:13:08.082Z11-05-2019 2019-05-11T02:12:42.981Z - - 11-04-2021

ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తాము కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారతామని చాలా ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయట. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచి ప్రధాన మంత్రి రేసులో ఉండాలని తాపత్రయపడుతున్నారు ఆయా పార్టీల అధినేతలు. ప్రధాని పీఠం దక్కకపోతే, కనీసం కేంద్రంలో చక్రం తిప్పేందుకు ఉవ్విళ్లూరుతున్నారట. టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ముందున్నట్లు తెలుస్తోంది. అయితే వీరికి భిన్నంగా ప్రధాని పదవి కోసం పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆశగా ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. అయితే గెలిచిన సీట్లు ఆధారంగానే పదవి కానీ, చక్రం తిప్పే అవకాశం ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించిన ఈ నేతలు, వీలైనన్ని ఎక్కవ సీట్లు గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అత్యధికంగా ఎంపీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీలు పొత్తు ఏర్పాటు చేసుకున్నాయి. అంటే వీరిద్దరికి కలిపి ఎక్కువ సీట్లు వచ్చినా, ప్రధాని రేసులో ఉన్న అఖిలేష్, మాయావతిలో ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. ఇక 48 ఎంపీ సీట్లు ఉన్న మహారాష్ట్రలో ఎన్సీపీ ఎన్ని గెలుస్తుంది అన్నదే ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ బీజేపీ, శివసేన కూటమి చాలా బలంగా ఉంది. ఈసారి కూడా ఈ కూటమి ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తెలంగాణాలో ఉన్న ఎంపీ సీట్లు 17, ఏపీలో ఉన్న ఎంపీ సీట్లు 25. ఈ రెండు పార్టీలు మొత్తానికి మొత్తం గెల్చుకుంటాయా అంటే అనుమానమే. ఎందుకంటే ఏపీలో జగన్ పార్టీ 20కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తుందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. ఇక తెలంగాణాలో కూడా కాంగ్రెస్, బీజేపీలు కొద్దోగొప్పో గెలవడం ఖాయం. అంటే వీరికి కూడా ప్రధాని అయ్యే అవకాశాలు తక్కువ. అయితే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువ సీట్లు గెలిచే అవకావం తమకే ఉందని మమత బెనర్జీ భావిస్తున్నారట. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 ఎంపీ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో 34 ఎంపీ సీట్లు గెల్చుకుంది మమత పార్టీ. ఈసారి అంతకంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు రాబట్టాలనేది ఆమె వ్యూహంగా తెలుస్తోంది. అయితే ఈ ఐదేళ్లలో బెంగాల్ జిల్లాల్లో బలం పుంజుకున్న బీజేపీ, ఎన్ని సీట్లు గెల్చుకుంటుందో అన్న భయం ఆమెను వెంటాడుతోందట. ఇప్పటికే తాను అవసరం అయితే మమత బెనర్జీకి మద్దతు ఇస్తానని శరద్ పవార్ ప్రకటించారు. వీరిదంతా ఓవైపు అయితే, కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్ల మీదే అసలు లెక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రాంతీయ పార్టీలు ప్రధాని పీఠం మీద చాలా ఆశగా ఉన్నాయట.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
14 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
10 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
13 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
17 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
20 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
21 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా