newssting
BITING NEWS :
*అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం *నా వల్ల.. వంశీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారంటూ టీడీపీ అడ్డగోలు కామెంట్లు - మంత్రి కొడాలి నాని *సీఎం జగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది..?-మంత్రి నాని *ఆర్టీసీ, రవాణాశాఖాదికారులతో సీఎం కేసీఆర్ భేటీ*శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ప్రమాదం లేదంటున్న డ్యామ్ సేఫ్టీ అధికారులు *తూ.గో: ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్*విజయవాడ: స్టెల్లా కాలేజీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత*2021 అసెంబ్లీ ఎన్నికలు అద్భుతాలు ఖాయం-రజనీకాంత్

మమత దీదీ పంతం నెరవేరే ఛాన్స్ లేదా?

04-07-201904-07-2019 09:26:28 IST
Updated On 04-07-2019 10:39:02 ISTUpdated On 04-07-20192019-07-04T03:56:28.188Z04-07-2019 2019-07-04T03:39:53.058Z - 2019-07-04T05:09:02.457Z - 04-07-2019

మమత దీదీ పంతం నెరవేరే ఛాన్స్ లేదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ పశ్చిమబెంగాల్ లో పాగా వేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరకు విజయం సాధించింది. మమత ఓటు బ్యాంకుకి గండి కొట్టింది బీజేపీ. మమత రాజ్యంలో జై శ్రీరాం అంటూ నినాదాలు చేసి బీజేపీ జెండాను పాతేశారు అమిత్ షా. తాజాగా వీరిమధ్య పశ్చిమబెంగాల్ పేరు మార్పు చిచ్చుపెడుతోంది. 

పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’గా పేరు మార్చే ప్రసక్తే లేదని ఈమేరకు కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రం పేరు మార్చాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంటుందని కేంద్రం తెలిపింది. హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖకు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. 

తమ రాష్ట్రం అక్షర క్రమంలో కూడా చివర ఉండటంపై  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవడానికి కూడా దీదీ సిద్ధం అవుతున్నారు. అయితే కేంద్రంలో అజేయశక్తిగా మారిన బీజేపీ మాత్రం మమత డిమాండ్లను తీర్చే అవకాశం ఏ కోశాన కనిపించడం లేదు.

మమతను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని, అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఎంసీని బలహీనం చేయడానికి బీజేపీ ఎడతెగని ప్రయత్నాల్లో నిమగ్నమయింది. మమతను మానసికంగా చికాకు పెట్టడానికి లక్షలాది పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టింది బీజేపీ. పశ్చిమబెంగాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింతగా బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అమిత్ షా-జేపీ నడ్డా పక్కా ప్లాన్ వేశారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle