newssting
BITING NEWS :
* మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

మమతకు వణుకు ప్రారంభమయిందా?

21-05-201921-05-2019 07:26:47 IST
Updated On 27-06-2019 13:39:44 ISTUpdated On 27-06-20192019-05-21T01:56:47.314Z21-05-2019 2019-05-21T01:53:48.674Z - 2019-06-27T08:09:44.136Z - 27-06-2019

మమతకు వణుకు ప్రారంభమయిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎగ్జిట్ పోల్స్ చూసిన త‌ర్వాత ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీకి కంటి మీద కునుకు లేకుండా పోయింద‌ట‌. ఓవైపు ఈవీఎం మిష‌న్ల మీద ఆరోప‌ణ‌లు చేస్తున్న మ‌మ‌త‌, లోలోప‌ల ర‌గిలి పోతున్న‌ట్లు ఆమె సొంత పార్టీ నేత‌లు చెబుతున్నారు. మ‌మ‌త బెన‌ర్జీ ఇంత‌గా ర‌గిలి పోవడానికి చాలా కారణాలు ఉన్నాయ‌ట‌. 

ముస్లిం ఓట్ బ్యాంక్ మీద ఆపేక్ష కొద్దీ వారి కోసం అడ్డ‌గోలుగా ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి, హిందూ ఓట్ బ్యాంక్ దూరం చేసుకున్న మ‌మ‌త బెన‌ర్జీ, 2021లో జ‌ర‌గ‌నున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల మీద బెంగ పెట్టుకున్నార‌ట‌. ఈ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌ ఫ‌లితాలే రెండేళ్ల త‌ర్వాత కూడా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రిపీట్ అయితే త‌న ప‌రిస్థితి ఏంట‌న్న దానిపై ఆమె తీవ్రంగా ఆలోచిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 

ఇప్ప‌టికే ప‌శ్చిమ బెంగాల్లోని సీపీఎం, కాంగ్రెస్ పార్టీల‌ను మ‌ట్ట‌సానికి తొక్కేసిన మ‌మ‌త‌, బీజేపీని ఏం చేయ‌లేని పరిస్థితిలో ఉన్నార‌ట‌. మొన్న‌టి దాకా కేంద్రం మ‌ద్ద‌తు ఉండ‌టంతో స్థానిక బీజేపీ నేత‌లు, పార్టీని బాగా విస్త‌రించారు.

ఇప్పుడు మ‌రోసారి ప్ర‌ధాని మోడీ అయితే, త‌న పార్టీ టీఎంసీ దెబ్బ‌తిన‌డం ఖాయ‌మ‌న్న‌ది ఆమె అనుమానం. అంతేకాదు, ఈ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన కాంగ్రెస్, సీపీఎంలు నామ‌మాత్రంగానే ప్ర‌చారం చేసి, త‌మ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని బీజేపీ వైపు మ‌ళ్లించిన‌ట్లు స‌ర్వేలే తేల్చేశాయి. 

ఇక మాట‌ల యుద్ధమే కాకుండా వీధి పోరాటాల్లో కూడా టీఎంసీతో బీజేపీ సై అంటోంది. టీఎంసీ కార్య‌క‌ర్త‌లు ఎంత‌గా రెచ్చిపోతుంటే, అంత‌కంటే ఎక్కువ రీతిలో బీజేపీ కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోతున్నారు. మ‌రో విష‌యం ఏంటంటే, త‌మ‌తో 40 మంది త్రుణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏలు ట‌చ్ లో ఉన్నారంటూ ప్ర‌ధాని మోడీ బెంగాల్ ఎన్నిక‌ల స‌భ‌లో బాంబ్ పేల్చారు. ఇది కూడా దీదీని టెన్ష‌న్ పెడుతోంది. 

మ‌రోసారి మోడీ ప్ర‌ధాని అయితే, ఈ రెండేళ్ల పాటైనా త‌న ప్ర‌భుత్వం స‌జావుగా సాగుతుందా అన్న అనుమానం మ‌మ‌త బెన‌ర్జీని ఇప్పుడు వెంటాడుతోంద‌ట‌. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎంలు ప్రేక్ష‌క పాత్ర వ‌హించాయ‌నీ, త‌మ‌కు రెండంకెల సీట్లు వ‌స్తే, దూకుడు పెంచుతామ‌నీ ఇప్ప‌టికే ప‌శ్చిమ బెంగాల్ బీజేపీ ఉపాధ్య‌క్షుడు ప్ర‌కాష్ మ‌జుందార్ ప్ర‌క‌టించారు. ఇక మోడీ ప్ర‌ధాని అయితే త‌న‌కు దిన‌దినం గండ‌మేన‌ని మ‌మ‌త బెన‌ర్జీకి అర్థ‌మైంద‌ట‌. 

ఇక తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్న కాంగ్రెస్, సీపీఎంలు ఈ ఫ‌లితాల త‌ర్వాత మ‌మ‌త బెన‌ర్జీ ప్ర‌భుత్వాన్ని కూల్చేసినా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని ఇప్ప‌టికే సంకేతాలు పంపాయ‌ట‌. త‌మ పార్టీ అధిష్టానం ఇందుకు ఒప్పుకున్నా, ఒప్పుకోక‌పోయినా త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌నీ, త‌మ‌తో పాటు బీజేపీకి కూడా ఉమ్మ‌డి శ‌త్రువైన మ‌మ‌త బెన‌ర్జీని గ‌ద్దె నుంచి దింపితే కానీ, తాము స్వేచ్చ‌గా ఉండ‌లేమ‌న్న ధోర‌ణలో ఆ రెండు పార్టీల నేత‌లు ఉన్నార‌ట‌. 

అందుకే అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నట్లు బెంగాలీ మీడియా క‌థ‌నాలు రాస్తోంది. ఇప్పుడు మ‌మ‌త దీదీని ఇంటికి పంపితే, బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి బ‌లం ఎంతో తేలిపోతుంద‌నీ, అప్ప‌టి సంగ‌తి అప్పుడు చూద్దామ‌న్న ఆలోచ‌న‌లో బెంగాల్ కాంగ్రెస్, సీపీఎం నేత‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle