మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ రాజీనామా.. బీజేపీపై ఫైర్
20-03-202020-03-2020 14:11:15 IST
2020-03-20T08:41:15.674Z20-03-2020 2020-03-20T08:41:02.508Z - - 16-04-2021

బలపరీక్షకు ముందే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం నాటికి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కమల్ నాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. రాజీనామాలు చేయడంతో కమల్నాథ్ సర్కార్ మైనార్టీలో పడిపోయింది. అసెంబ్లీలో సరిపడ బలం లేకపోవడం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. రాజ్భవన్లో గవర్నర్ లాల్జీ టాండన్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కాంగ్రెస్కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాషాయ దళంలో చేరడంతో కమల్నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. సీఎంగా ప్రమాణం చేసిన 15 నెలల్లోనే ఆయన రాజీనామా చేశారు. ప్రభుత్వంపై ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదన్న పిటిషన్పై విచారణ సందర్భంగా.. వెంటనే సభలో విశ్వాసాన్ని నిరూపించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను చక్కదిద్దేందుకు సభలో విశ్వాస పరీక్ష జరపాలని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం సభాపతిని ఆదేశించింది. దీంతో కమల్ నాథ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నించిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గడిచిన 15 నెలల్లో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, అయినా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్రలు పన్నిందన్నారు. ఎమ్మెల్యేలను కర్నాటకలో బంధించారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్ ప్రజాపతి.. గత రాత్రి మిగిలిన 16మంది శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించారు. దీంతో అసెంబ్లీలో సంఖ్యాపరంగా భారీ మార్పులు జరిగాయి. సభలో మెజార్టీకి కావాల్సిన సభ్యలు సంఖ్య 104కి పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ 92 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉన్నారు. విశ్వాస పరీక్షకు వెళ్ళి భంగపాటుకు గురయ్యే కంటే ముందే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కమల్ నాథ్ రాజీనామా తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు రెడీ అవుతోంది. గతంలోనూ విశ్వాస పరీక్షకు ముందే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. అదే దారిలో కర్నాటకలో కుమారస్వామికి ముందు యడియూరప్ప కూడా విశ్వాసపరీక్షకు ముందే రాజీనామా చేయాల్సి వచ్చింది.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
11 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
7 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
9 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
11 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
14 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
18 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
18 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా