newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత

21-07-202021-07-2020 10:02:04 IST
2020-07-21T04:32:04.355Z21-07-2020 2020-07-21T04:31:52.758Z - - 23-04-2021

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ అనారోగ్యంతో మరణించారు. ఆయన యూపీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా టండన్ కు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆయన మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం టాండన్ కు 85 ఏళ్ల వయస్సు. లాల్జీ టాండన్ కుమారుడు అశుతోష్ టాండన్ తన తండ్రి మరణించిన విషయాన్ని ట్విట్టర్ లో ధృవీకరించారు. 

మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు తన తండ్రి తుది శ్వాస విడిచారన్నారు. టాండన్‌ మృతిపట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో పాటు పలువురు ప్రముఖులు,కేంద్రమంత్రులు తమ సంతాపం తెలిపారు. గవర్నర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గవర్నర్ లాల్జీ టాండన్ కొద్ది రోజుల‌ క్రితం సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌‌కు వెళ్లి అస్వస్థతకు గురయ్యారు. 

జూన్ 11న జ్వరం, మూత్ర సంబంధ సమస్యలతో ఉత్తరప్రదేశ్ లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయనకు కాలేయం, కిడ్నీ సమస్యలున్నట్లు వైద్యులు గుర్తించారు. నాటి నుంచి ల‌క్నోలోని మేదాంత ఆస్పత్రిలోనే లాల్జీ టాండన్ చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఆయన 22వ గవర్నర్ గా పనిచేశారు. లక్నోలోని చౌక్ నవూ గ్రామంలో జన్మించిన టాండన్ విద్యార్ధి దశనుంచే ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా క్రియాశీలక పాత్ర పోషించారు. 20 జూలై 2019 మధ్యప్రదేశ్ గవర్నర్ గా బాద్యతలు చేపట్టారు. 

1970దశకంలోనే ఆయన కార్పోరేటర్ అయ్యారు. అనంతరం యూపీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఏబీ వాజ్ పేయి హయాంలో టాండన్ కు పార్టీలో ప్రాధాన్యత పెరిగిందని చెబుతారు. 1991 నుంచి 2003 వరకూ యూపీలో మంత్రిగా పనిచేశారు. 2009లో లోక్ సభకు లక్నో నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2014లో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కోసం ఆ సీటు వదులుకున్నారు. 2018 ఆగస్టులో బీహార్ గవర్నర్ అయ్యారు. అనంతరం 2019లో మధ్యప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ప్రజలు మెచ్చిననాయకుడు టాండన్ అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొనియాడారు. యూపీమంత్రిగా అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు రాజ్ నాథ్ సింగ్. 

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle