newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మధ్యప్రదేశ్ కింగ్.. శివరాజ్ సింగ్.. నాలుగోసారి సీఎం

24-03-202024-03-2020 08:07:36 IST
Updated On 24-03-2020 11:43:07 ISTUpdated On 24-03-20202020-03-24T02:37:36.075Z24-03-2020 2020-03-24T02:35:57.995Z - 2020-03-24T06:13:07.281Z - 24-03-2020

మధ్యప్రదేశ్ కింగ్.. శివరాజ్ సింగ్.. నాలుగోసారి సీఎం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజకీయ చదరంగంలో ఎవరు పావులు బాగా కదిపితే వారిదే పైచేయి. తాజాగా అదే నిజమయింది. మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం సోమవారం రాత్రితో ముగిసింది. బీజేపీ వేసిన ఎత్తులు పారాయి. దీంతో కాంగ్రెస్ ఆశలు అడియాశలయ్యాయి, బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మధ్యప్రదేశ్‌ సీఎంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ లాల్జీ టాండన్‌ రాత్రి 9.00 గంటలకు చౌహాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో నాలుగు సార్లు మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. 

ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటుగా.. మాజీ సీఎం కమల్‌నాథ్‌ కూడా హాజరయ్యారు. అసెంబ్లీలో బలపరీక్షకు ముందే సీఎం కమల్ నాథ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడంతో కొత్త శకం ఆరంభమయింది.. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చౌహాన్‌ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయడంతో.. కొత్త మంత్రి వర్గాన్ని వచ్చే వారంలో విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు కేబినెట్ విస్తరణలో.. జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి పెద్ద పీట వేస్తారనే ప్రచారం సాగుతోంది. సింధియా వెంట 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు. సింధియా బీజేపీలో చేరిన అనంతరం.. ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీ గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో కమల్ నాథ్‌ సర్కార్ మైనార్టీలో పడిపోయింది. మొత్తం 230 మంది సభ్యులు ఉన్న మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ప్రస్తుతం 107 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో.. పార్టీ బలం 92 మందికి పడిపోయింది. 

దీంతో సభ బలం 206కు తగ్గి.. మెజార్టీ 104కి పడిపోయింది. అయితే అప్పటికే బీజేపీకి 107 ఉండటంతో.. ఇతర పార్టీల మద్దతు లేకుండానే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్ సంక్షోభానికి కర్నాటక ఫార్ములా అనుసరించింది బీజేపీ. గతంలో కుమారస్వామి నాయకత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. వారంతా రాజీనామా చేయడంతో కుమారస్వామి పదవి పోయింది. అనంతరం యడియూరప్ప సీఎం అయ్యారు. ఇప్పుడు కూడా అదే తరహాలో రాజకీయం నడిచింది. మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle