newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతల అసహనం

01-06-201901-06-2019 08:41:37 IST
2019-06-01T03:11:37.279Z01-06-2019 2019-06-01T03:04:00.057Z - - 21-08-2019

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతల అసహనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే జాలేస్తోంద‌ట‌. 15 సంవ‌త్స‌రాలు పోరాడి అధికారం ద‌క్కించుకున్న త‌మ‌ పార్టీ, ప‌ట్టుమ‌ని 15 నెల‌లు కూడా తిన్న‌గా రాష్ట్రాన్ని పాలించ‌లేక పోతోంద‌ని స్వ‌యానా హ‌స్తం పార్టీ నేత‌లే మండిప‌డుతున్నార‌ట‌.

15 ఏళ్లుగా స్థానికంగా ఇబ్బందులు, కేసులు ఎదుర్కొని, అన్ని క‌ష్టాలూ భ‌రించి తాము అధికారం అప్ప‌గిస్తే, పార్టీ పెద్ద‌ల తీరు, త‌మ‌ను అస‌హ‌నానికి గురి చేస్తోంద‌ని స్థానిక కాంగ్రెస్ నేత‌లు, కొంద‌రు ఎంఎల్ఏలు వాపోతున్నార‌ట‌. 

2018 డిసెంబ‌రులో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మొత్తం 230 సీట్ల‌లో 114 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ, ఎస్పీకి చెందిన ఒక‌రు, బీఎస్పీకి చెందిన ఇద్ద‌రితో పాటు, న‌లుగురు స్వ‌తంత్ర ఎంఎల్ఏల మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. మ్యాజిక్ ఫిగ‌ర్ 116 కంటే ఐదుగురి సంఖ్యాబ‌లం ఎక్కువ బ‌లం సంపాదించిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ సీనియ‌ర్ నేత క‌మ‌ల్ నాథ్ నాయ‌క‌త్వంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

అప్ప‌టి నుంచీ క‌మ‌ల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా వ‌ర్గాల మధ్య పొస‌గ‌డం లేదు. ఇక మొన్న‌టి పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చావుదెబ్బతింది.

ఆ పార్టీ ప్ర‌దాన నేత‌లు జ్యోతిరాదిత్య సింథియా, దిగ్విజ‌య్ సింగ్, అజ‌య్ సింగ్, అరుణ్ యాద‌వ్ త‌దిత‌రులు ఓడిపోయారు. మ‌రో విష‌యం ఏంటంటే, మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంగా ఉన్న క‌మ‌ల్ నాథ్‌, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా కూడా కొన‌సాగుతున్నారు. 

ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఓట‌మికి ఆయ‌నే కార‌ణం అంటూ ఇప్పుడు జ్యోతిరాదిత్య సింథియా వ‌ర్గం ఆరోపిస్తోంది. టిక్కెట్ల పంపిణీలో క‌మ‌ల్ నాథ్ ఒంటెద్దు పోక‌డ‌లు పోయార‌నీ, అందుకే ఇలాంటి ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని ప్ర‌చారం చేస్తున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు జ్యోతిరాదిత్య సింథియాకు అప్ప‌గించాల‌నీ డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను అధ్య‌క్ష ప‌ద‌వి వ‌దులుకుంటానికి సిద్ధ‌మే అనీ, అయితే త‌న అనుచ‌రుడికే ఆ ప‌ద‌వి ఇవ్వాల‌ని క‌మ‌ల్ నాథ్ ప‌ట్టుబ‌డుతున్నారు. 

వీరిద్ద‌రి గొడ‌వ‌తో ఇప్పుడు మ‌ధ్య‌ప్ర‌దేశ్ జ‌నాల‌కు చిర్రెత్తుకొస్తోంద‌ట‌. పాలించ‌మ‌ని అధికారం ఇస్తే, సొంత రాజ‌కీయాల‌తో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నార‌ని జ‌నం మండిప‌డుతున్నారు. మ‌రోవైపు తాజా ప‌రిణామాల‌ను అనుకూలంగా మ‌ల్చుకుంటున్న బీజేపీ, మ‌ళ్లీ అధికారం కోసం పావులు క‌దుపుతోంది. అయితే క‌మ‌ల్ నాథ్ ప్ర‌భుత్వాన్ని తాము కూల్చ‌కుండా, కాంగ్రెస్ పార్టీ స్వ‌యంగా కూల్చుకునే దాకా ఆగాల‌న్న ధోర‌ణిలో క‌మ‌ల‌నాథులు ఉన్న‌ట్లు తెలుస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle