మద్యం షాపులు తెరుస్తారా? కండిషన్స్ అప్లై
12-04-202012-04-2020 17:51:30 IST
2020-04-12T12:21:30.070Z12-04-2020 2020-04-12T12:21:19.109Z - - 17-04-2021

దేశవ్యాప్తంగా కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. కేసులు క్షణక్షణానికీ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ అమలవుతోంది. రెండురోజుల్లో మొదటి దశ లాక్ డౌన్ పూర్తయింది. రెండవ దశ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మందుబాబులకు గుడ్ న్యూస్ వినిపించింది కేంద్రం. దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా లిక్కర్ షాపులు మూతపడటంతో మద్యం ప్రియులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల అయితే నోట్లోకి చుక్క పోక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో ఎర్రగడ్డ మానసిక వైద్యాలయానికి జనం పోటెత్తుతున్నారు. మద్యం ప్రియుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మేఘాలయా సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్17 వరకూ రాష్ట్రంలో మద్యం షాపులు తెరవనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆరు రోజులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉండనున్నట్లు మేఘాలయ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కస్టమర్లు షాపుల వద్ద దాదాపు 1మీటర్ వరకు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం లేదా ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్లడంపై నిషేధం ఉంటుందన్న ప్రభుత్వం కేవలం ఇంటికి ఒక్కరినే వైన్ షాపు దగ్గరకు వెళ్లేందుకు అనుమతిస్తామంటోంది. అంతేకాదు, కొన్ని కండిషన్లు కూడా పెట్టింది. వైన్ షాపులలో సిబ్బంది తక్కువగా ఉండాలని, మద్యం బాటిళ్లు మరియు నగదును తీసుకునేటప్పుడు లేదా ఇచ్చేటప్పుడు వినియోగదారులకు మరియు సిబ్బందికి హ్యాండ్ శానిటైజర్లను అందించాలని ఆదేశించింది. మేఘాలయ రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ వైన్ షాపుల సంగతి మేఘాలయాకే పరిమితం కానుంది. మరి మాసంగతి ఏంటని మిగతా రాష్ట్రాల ట్యాక్స్ పేయర్లు అడుగుతున్నారు. మందడిగితే మక్కెలరిగదీస్తా అని తెలంగాణ సీఎం కేసీయార్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ఏపీలోనూ అంతే. కానీ మందుబాబులు మాత్రం రెండుమూడు రెట్లు మరీ ఇచ్చి బ్లాక్ లో మందు కొనేసి, నాలిక తడిపేసుకుంటున్నారు. మందు బాబులా మజాకా.

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
10 minutes ago

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి
3 minutes ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
an hour ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
2 hours ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
4 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
3 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
6 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
19 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
a day ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
21 hours ago
ఇంకా