మందిర నిర్మాణం జరిగాకే అయోధ్యకు వస్తా.. ప్రధాని 28 ఏళ్ల శపథం ఫలిస్తున్నట్లేనా?
03-08-202003-08-2020 06:02:22 IST
2020-08-03T00:32:22.802Z03-08-2020 2020-08-03T00:32:19.743Z - - 14-04-2021

ఆగస్టు 5 ఇప్పటినుంచి ఒక అద్వితీయ చరిత్రను సొంతం చేసుకోనుంది. శతాబ్దాల భారతీయుల నిరీక్షణ ఫలించి, రామజన్మభూమిలో రాముడి గుడికి పునాదిరాయి పడనున్న ఈ రోజు రేపటి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడనుంది. చారిత్రాత్మకమైన ఈ శుభఘడియకు మరో ముూడురోజులే మిగిలుండటంతో యావద్దేశం చూపు అయోధ్యపైనే నిలిచింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా అతిరథ మహారథులు హాజరవనుండడంతో.. ఆలయ ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు భారీగా తరలివస్తారన్న అంచనాల నేపథ్యంలో.. అయోధ్య ఇప్పటికే భద్రతా బలగాల చేతుల్లోకి వెళ్లిపోయింది. పోలీసు బలగాలు ఈ భక్తి నగరాన్ని పూర్తిగా కమ్మేశాయి. సమూహాలుగా ఏర్పడడం, గుమిగూడడంపై పోలీసులు నిషేధం విధించారు. అయితే ఈ శుభఘడియ ప్రధాని నరేంద్రమోదీకి అద్భుత జ్ఞాపకాన్ని మిగల్చనుంది. ఎందుకంటే 28 సంవత్సరాల క్రితం ఆయన అయోధ్యను సందర్శించారు. 1992లో అయోధ్య రామాలయం నిర్మించాలని, కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయాలని కోరుతూ నరేంద్ర మోదీ తిరంగా యాత్రను చేపట్టారు. దీనిలో భాగంగానే అదే ఏడాది జనవరిలో తొలిసారి అయోధ్యకు చేరుకున్నారు. ఆయనతో పాటు అప్పటి ఉత్తర ప్రదేశ్ బీజేపీ చీప్ మురళీమనోహర్ జోషీ, పలువురు పార్టీ సీనియర్లు మోదీ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా అయోధ్యను సందర్శించిన మోదీ.. మరోసారి ఇక్కడికి వస్తే అది మందిర నిర్మాణం జరిగాకే వస్తానంటూ శపథం చేశారు. ఈ విషయాన్ని ఆనాడు మోదీ వెంట ఉన్న ఓ నాయకుడు ఇటీవలే చెప్పారు. సరిగ్గా 28 ఏళ్ల తరువాత అయోధ్య వివాదం సమసిపోవడంతో ప్రధానమంత్రి హోదాలో మోదీ అయోధ్యలో పర్యటిస్తున్నారు. మోదీ ఆనాటి పర్యటన సంబంధించిన ఫోటోసైతం వెలుగులోనికి వచ్చింది. ప్రధాని మోదీ హాజరవనున్న ఈ కార్యక్రమంలో.. ఆయనతో పాటు మరో నలుగురు వేదికను పంచుకోనున్నారు. రామజన్మభూమి న్యాస్ చీఫ్ సహా ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భగవత్, నృత్య గోపాల్దా్స, మరో ప్రముఖుడు ప్రధానితో కలిసి వేదికపై ఆసీనులవుతారు. రాజకీయ కురువృద్ధుడు, రామాలయ స్వాప్నికుడు ఎల్కే అడ్వాణీ, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా అయోధ్య రామాలయ శంకుస్థాపన వేడుకల్లో పాల్గొననున్నారు. బీజేపీ సీనియర్ నేతలు ఉమాభారతి, కళ్యాణ్‌సింగ్‌లు కూడా ఈ కార్యక్రమానికి నేరుగా హాజరవనున్నారు. భూమి పూజకు తాము కచ్చితంగా హాజరవుతామని వారు పేర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అడ్వాణీ, జోషీ, ఉమా భారతి ప్రధాన నిందితులన్న సంగతి తెలిసిందే. ఆహ్వానాల వ్యవహారాన్ని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌కు శనివారం ఆహ్వానాలు అందాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా అయోధ్యలో భూమిపూజ మహోత్సవానికి హాజరు కానున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీఐపీ అతిథుల జాబితాను 50 మందికి కుదించినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలియజేసింది. భవ్య రామ మందిరం భూమిపూజకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
3 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
4 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
4 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
8 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
9 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
7 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
10 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
10 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
5 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
12 hours ago
ఇంకా