newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మందగమనంపై ఆనాడే హెచ్చరిస్తే గేలి చేశారు.. రాహుల్ గాంధీ

27-08-202027-08-2020 17:18:03 IST
Updated On 27-08-2020 17:42:40 ISTUpdated On 27-08-20202020-08-27T11:48:03.738Z27-08-2020 2020-08-27T11:48:01.989Z - 2020-08-27T12:12:40.320Z - 27-08-2020

మందగమనంపై ఆనాడే హెచ్చరిస్తే గేలి చేశారు.. రాహుల్ గాంధీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ‌ప్రభావంతో దేశం కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటోదని ఇంతవరకు ఎన్ని సార్లు హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా తననే ఎగతాళి చేస్తూ వచ్చారని కానీ, భార‌త ఆర్థిక మంద‌గ‌మ‌నంపై తాను చేసిన వ్యాఖ్య‌ల‌నే ఆర్‌బీఐ ధృవీకరించిందంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. గ‌త కొన్ని నెల‌లుగా దేశ ఆర్థిక సంక్షోభం, మోదీ ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న తీరుపై రాహుల్ విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. ఆర్‌బీఐ వార్షిక నివేదిక వెల్లడైన నేపథ్యంలో రాహుల్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

భార‌త ఆర్థిక మంద‌గ‌మ‌నంపై తాను చేసిన వ్యాఖ్య‌ల‌నే ఆర్‌బీఐ ధృవీకరించిందంటూ ట్వీట్ చేశారు. దేశ ఆర్ధిక పరిస్థితి గురించి నేను నెలల తరబడి హెచ్చరిస్తున్న విషయాన్నే ఇప్పుడు ఆర్‌బీఐ వార్షిక నివేదికలో కూడా పేర్కొంది. పారిశ్రామికవేత్తలకు పన్ను తగ్గింపు కాకుండా పేదలకు డబ్బు పంచండి. వినియోగాన్ని ప్రోత్స‌హించి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ద‌రించండి. మీ ప్రచారాల‌కు మీడియాను వాడుకున్నంత మాత్రాన భార‌త్ ఆర్థిక సంక్షోభంలో ఉంద‌న్న విష‌యం క‌నిపించ‌క‌మానదు అంటూ కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్‌గాంధీ కేంద్రంపై మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. 

కరోనావైరస్ మహమ్మారి ప్రభావం భారతదేశ సంభావ్యతపై నిర్మాణాత్మక క్షీణతకు కారణమవుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. 2008లో దేశ ఆర్థిక సంక్ష‌భంతో పోలిస్తే ప్ర‌స్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయ‌ని, ఇప్ప‌ట్లో కోలుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని ఆర్‌బీఐ నివేదిక‌లో వెల్ల‌డించింది. దీంతో ఆర్థిక వ్యవస్థ మందగమనం రెండో త్రైమాసికంలోనూ కొనసాగనుందని తెలిపింది. 

వినిమయ రంగానికి తీవ్ర విఘాతం నెలకొందని, డిమాండ్‌ పుంజుకునే కార్యకలాపాలు ఆశించిన మేర పుంజుకోలేదని పేర్కొంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో వృద్ధికి ఉపకరించే మూలధన వ్యయం వెచ్చించే పరిస్థితి లేదని తెలిపింది. పన్ను ఎగవేతదారులను గుర్తించి పన్ను వసూళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని, జీఎస్టీ సరళీకరణతో పాటు ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని సూచించింది.

అయితే ఈ ప‌రిస్థితుల‌పై తాను ఎప్పుడో మాట్లాడినా మోదీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని రాహుల్ ఆరోపించారు. కరోనా కారణంగా దేశం భారీ నష్టాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని నేను  ఇది వరకే హెచ్చరించాను. కానీ అప్పుడు మీడియా నన్ను ఎగతాళి చేసింది. ఈ రోజు మళ్లీ అదే చెబుతున్నా. కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వదు. ఒకవేళ మీరు దీనిని అంగీకరించకపోతే 6-7 నెలలు వేచి ఉండండి మీకే తెలుస్తుంది” అని పేర్కొన్నారు. 

అలాగే గడిచిన నాలుగు నెలల్లో సుమారు రెండు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని రాహుల్ బుధవారం ట్వీట్ చేశారు. గత నాలుగు నెలల్లో సుమారు రెండు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబాల భవిష్యత్తు అంధకారంలో ఉంది. సోషల్‌ మీడియాల్లో నకిలీ వార్తలు వ్యాప్తి చేయడం ద్వారా నిరుద్యోగం​, ఆర్థిక వ్యవస్థలోని నిజాలను దాచలేము అంటూ రాహుల్ ట్వీట్‌ చేశారు. 

మోదీ ప్రభుత్వం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ లబ్ధిదారుల జాబితాను విస్తరించాల్సి ఉందని, కాని ప్రభుత్వం అలా చేయలేదన్నారు. ప్రజల హక్కు అయిన రేషన్ వారికి అందడం లేదని ఆరోపించారు. ఈ సమస్య విషాద రూపాన్ని సంతరించుకుందంటూ ఆయన హిందీలో ట్వీట్‌లో చేశారు. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   6 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   6 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   11 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   12 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle