newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భైంసా కర్ఫ్యూ.. బీజేపీ నేతల ఆగ్రహం!

15-01-202015-01-2020 11:01:26 IST
2020-01-15T05:31:26.325Z15-01-2020 2020-01-15T05:31:22.856Z - - 11-04-2021

భైంసా కర్ఫ్యూ.. బీజేపీ నేతల ఆగ్రహం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిర్మల్ జిల్లా భైంసాలో అల్లర్ల గురించి గత రెండు రోజులుగా అందరూ వింటున్నదే. అయితే ఆదివారం రాత్రికే ఈ అల్లర్లు చెలిరాగాయని ప్రపంచానికి సోమవారం సాయంత్రం కానీ తెలియలేదంటే రాష్ట్రంలో ఎలాంటి దౌర్భగం నెలకొందో ప్రజలే అర్ధం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక సోమవారం సాయంత్రం ఏడూ గంటల నుండి మంగళవారం ఉదయం ఏడుగంటల వరకు కర్ఫ్యూ విధించారు.

ఈ కర్ఫ్యూ విధించామని పోలీసులు ప్రకటిస్తేకానీ ప్రపంచానికి తెలియలేదు అక్కడి పరిస్థితులు ఎంత దిగజారాయో. మరి ఆదివారం సాయంత్రం గొడవ మొదలైన దగ్గర నుండి సోమవారం సాయంత్రం 144 సెక్షన్ విధించేవరకు ఏం జరిగింది? పోలీసులు ఎందుకు కర్ఫ్యూ వరకు వెళ్లారు? మీడియా ఎందుకు ఈ విషయాన్ని లైట్ తీసుకుంది? బీజేపీ నేతలు ఎందుకు మండిపడుతున్నారు? అన్నది తెలుసుకుందాం.

ముందు ఇద్దరి మధ్య మొదలైన ఈ గొడవ కాస్త రెండు వర్గాల మధ్య గొడవ చివరికి రెండు వర్గాల మధ్యగా మారిందంటే అంత నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు కాకపోతే అదే నిజం. ఓ వ్యక్తి ఆదివారం సాయంత్రం ఏడు-ఎనిమిది గంటల మధ్యలో బైకుపై వెళ్తుండగా మరో వ్యక్తితో చిన్న వివాదం మొదలైంది. అది కాస్త అర్ధరాత్రికి పెను వివాదంగా మారి రెండు వర్గాల మధ్య గొడవగా చెలరేగింది.

ఆదివారం రాత్రికే రంగప్రవేశం చేసిన పోలీసులు పరిస్థితిని అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారు. చిన్న వివాదంగానే తీసుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా సోమవారం ఉదయానికి చేయి ధాటిపోయింది. దీంతో సోమవారం భారీగా మోహరించిన పోలీసులు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ సోమవారం కూడా పోలీసులు ఫెయిల్ అయ్యారు.

అప్పటికే 144 సెక్షన్ విధించిన పోలీసులు సోమవారం రాత్రి ఏడు గంటల నుండి మంగళవారం ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్యూ ప్రకటించారు. అయితే మంగళవారం కూడా పూర్తిగా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కర్ఫ్యూ కొనసాగిస్తున్నట్లుగా ప్రకటించారు. దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఓ వర్గం నేతలపై మరో వర్గం బహిరంగ దాడులకు పాల్పడినా పోలీసులు తీవ్రంగా ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు.

నిజానికి ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాస్త హిందూ-ముస్లిం మధ్య గొడవగా మారింది. అయితే ఇది మతపరమైన గొడవగా ప్రపంచానికి తెలియకుండా ప్రభుత్వం ముందుగానే పలు చర్యలకు దిగింది. అల్లర్లు శృతిమించుతాయని భయమా? మున్సిపల్ ఎన్నికల వేళ ఎందుకొచ్చిన పంచాయతీ అని ఆలోచనా? కానీ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంది.

అయితే హిందువులపై దాడులు చేసినా ప్రభుత్వం చర్యలు లేవని బీజేపీ నేతలు ప్రభుత్వంపై పలు ఆరోపణలకు దిగారు. ఈ ఘటనపై పూర్తి విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తే కానీ పూర్తి విషయాలు బయటకి రావు. మరి ప్రభుత్వం ఆదేశిస్తుందా? అంటే అది కూడా అనుమానమే!

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle