newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భూమిపూజ రాజ్యాంగ విధుల్లో భాగమేనా మోదీజీ.. ఒవైసీ వ్యాఖ్య

29-07-202029-07-2020 12:38:48 IST
Updated On 29-07-2020 13:09:10 ISTUpdated On 29-07-20202020-07-29T07:08:48.062Z29-07-2020 2020-07-29T07:08:38.062Z - 2020-07-29T07:39:10.695Z - 29-07-2020

భూమిపూజ రాజ్యాంగ విధుల్లో భాగమేనా మోదీజీ.. ఒవైసీ వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అయోధ్యలో రామాలయ నిర్మాణ కార్యక్రమానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధమవుతున్న వేళ హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లౌకిక సూత్రానికి కట్టుబడి విధులు నిర్వర్తిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ దేశ ప్రధానిగా బాధ్యతలు స్పీకరించారని, ఇప్పుడు ఆ ప్రమాణాన్ని ఉల్లంఘింస్తున్నారని మండిపడ్డారు.

అయోధ్య రామమందిర భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మోదీ వెళ్లడంపై ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్‌ 6న ఓ నేరస్తుల గుంపు ధ్వంసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం ట్విటర్‌ వేదికగా ఓవైసీ పోస్ట్‌ చేశారు. లౌకికతత్వమనేది రాజ్యాంగంలో ముఖ్యభాగమని దానిని అందరూ తప్పనిసరిగా గౌరవించాలని హితవుపలికారు.

మరోవైపున ఆగస్ట్‌ 5న అయోధ్యలో జరిగే భూమి పూజ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ షెడ్యూల్‌ ఖరారైన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 250 మంది అతిధులు సైతం శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం అందుకోనున్నారు. మరోవైపు రామాలయ పూజ  సందర్భంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందువులు పవిత్ర స్థలాల నుంచి నీరు, మట్టిని అయోధ్యకు తీసుకువస్తున్నారు. కోవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా భూమిపూజ నిర్వహిస్తున్నామని,  ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో వీక్షించాలని రామ జన్మభూమి తీర్ధ్‌ క్షేత్ర ట్రస్ట్‌ చైర్మన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఆగస్టు 5న అయోధ్యలో రామాలయ భూమిపూజా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు వామపక్ష నేత ఒకరు తీవ్రంగా వ్యతిరేకత తెలిపిన నేపథ్యంలో ప్రధాని రాజ్యాంగ విధులనే ప్రశ్నిస్తూ ఒవైసీ వ్యాఖ్యానించడం గమనార్హం. 

అయితే వామపక్షాలు, ఒవైసీ వంటి నేతలు వ్యతిరేకత తెలుపుతున్నప్పటికీ ఆగస్టు 5న జరగనున్న రామాలయ భూమి పూజను దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసాకారం చేయడానికి కేంద్రం పూనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల కోట్లాదింమంది రామభక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోంచే భూమి పూజా కార్యక్రమాన్ని చూసి ఆనందిస్తారని కేంద్రం భావన.

మరోవైపు రామాలయ నిర్మాణానికి దేశం నలుమూలలనుంచి భారీ ఎత్తున విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఆధ్యాత్మిక గురువులు, ఆశ్రమాలే అయిదు కోట్ల రూపాయల చొప్పున భూరి విరాళాలు ప్రకటిస్తున్నారు. అలాగే రామాలన నిర్మాణానికి ముస్లింలు విరాళాలు పంపినా సంతోషంగా స్వీకరిస్తామని హిందూ పూజారి ఒకరు ప్రకటించారు. ఆలయ నిర్మాణం కోసం ముస్లింలు కూడా విరాళాలు ఇవ్వాలనుకుంటే వారిని నిరాశ పర్చబోమని మహంత్ కమల్ నయన్ దాస్ తెలిపారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle