భారత మీడియా ప్రపంచ వాణి కావాలి.. ప్రధాని మోదీ ఆకాంక్ష
09-09-202009-09-2020 09:59:27 IST
2020-09-09T04:29:27.944Z09-09-2020 2020-09-09T04:29:26.075Z - - 22-04-2021

భారత మీడియా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. ప్రస్తుతం భారత ఉత్పత్తులనే కాకుండా మన గళాన్ని కూడా ప్రపంచం ఆదరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం జైపూర్‌లో పత్రికా గేట్‌ను, పత్రికా గ్రూప్ చీఫ్ గులాబ్ కొఠారీ రాసిన రెండు పుస్తకాలను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు అంతర్జాతీయ వేదికలపై భారత ప్రాతినిథ్యం పెరిగిన క్రమంలో భారత మీడియా కూడా అంతర్జాతీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. మన వార్తాపత్రికలు, మేగజీన్లకు అంతర్జాతీయంగా ఆదరణ ఉందని, డిజిటల్ శకంలో మనం డిజిటల్ వేదికగా ప్రపంచానికి చేరువ కావాలని అన్నారు. ప్రపంచదేశాల దృష్టి అంతా భారత్ వైపే ఉన్న తరుణంలో భారతీయ ఉత్పత్తులే కాదు భారతీయ గొంతుకూడా ప్రపంచవ్యాప్తంగా వినిపించాలని ప్రధాని మోదీ అన్నారు. అంతర్జాతీయంగా ఇప్పుడు భారత్ కీలకంగా మారిన తరుణంలో మన మీడియాకూడా ప్రపంచ స్థాయిలో రాణించాల్సిన అవసరం ఉందని అన్నారు. కోవిడ్-19పై భారత మీడియా పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించిందని ప్రశంసించారు. సోషల్ మీడియా మాదిరిగా మీడియా సైతం కొన్ని సందర్భాల్లో విమర్శలు గుప్పించినా విమర్శల నుంచి ప్రతిఒక్కరూ నేర్చుకోవాలని, ఇదే దేశ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుందని అన్నారు. ప్రజలు పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలని సూచించారు. వేదాలు, ఉపనిషత్తులు ఆథ్యాత్మిక, వేదాంత విజ్ఞానానికే పరిమితం కాదని, విశ్వం, శాస్త్రాల లోతులనూ అందిపుచ్చుకునే సామర్థ్యం కలిగినవని చెప్పుకొచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా భారత దేశం పట్ల ప్రపంచం ఎన్నడూ లేనంత ఆసక్తి ప్రదర్శిస్తున్నందున భారత్ వాణి సైతం మరింత అంతర్జాతీయ స్వభావం సంతరించుకుందని మోదీ సగర్వంగా చెప్పారు. ప్రతి అంతర్జాతీయ సమావేశంలోనూ భారత వాణి శక్తిమంతంగా ప్రదర్శితమవుతోందని, కాబట్టే భారత మీడియా గ్లోబల్ కావలసిన అవసరం ఇప్పుడే ఎక్కువగా ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. టెక్స్టూ, ట్వీట్ రెండూ రాజ్యమేలుతున్న ప్రస్తుత యుగంలో మన కొత్త తరం విజ్ఞానాన్ని లోతుగా మధించడంలో వెనకడుగు వేయడం లేదని మోదీ చెప్పారు. దేవుని పూజించడానికి ఇంటిలో కాస్తంత స్థలం రిజర్వ్ చేసుకుంటున్నట్లే ప్రతి ఇంట్లో పుస్తకాలకు కూడా ప్రత్యేకంగా స్థలం కేటాయించుకోవాలని, ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవాలని ప్రధాని సూచించారు.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
10 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
13 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
14 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
14 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
12 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
21-04-2021

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా