newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భారత్ బంద్ ప్రకటించే యోచనలో మోడీ

24-03-202024-03-2020 14:24:00 IST
2020-03-24T08:54:00.419Z24-03-2020 2020-03-24T08:53:48.380Z - - 17-04-2021

భారత్ బంద్ ప్రకటించే యోచనలో మోడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనతా కర్ఫ్యూ తర్వాత మోడీ ఆలోచన అదేనా

జనంలో మార్పు రాలేదా?

లాక్ డౌన్ తో ప్రయోజనం కనిపించడం లేదా?

కరోనాపై దాడికి సామాజిక దూరం

భారత్ బంద్ తో సకలం బంద్ చేసే ఆలోచన

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గలేదా?

విదేశాలనుంచి వచ్చేవారిని నియంత్రించే ఆలోచన

కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రధాని మోడీ కీలక ప్రకటన చేసేందుకు సిద్ధపడుతున్నారు.  లాక్ డౌన్ ను ప్రజలు ఉల్లంఘించడంపై కేంద్రం సీరియస్ అయింది.  కర్ఫ్యూ విధించాలంటూ రాష్ట్రాలకు సూచన. భారత్‌లో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనాపై యుద్ధానికి మోడీ సన్నద్ధం. రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోడీ.  ఈప్రసంగంలోనే మోడీ కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో 36కు చేరాయి కరోనా పాజిటివ్ కేసులు.

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం ఎన్ని విధాల అవగాహన కల్పిస్తున్న కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది గమనించిన మోడీ ఇలా అయితే దేశం సంక్షోభంలో పడడం ఖాయం అని భావించారు. కరోనా ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగాన్ని మోగిస్తోంది. భారత్ లో ప్రస్తుతం కేసుల సంఖ్య 464 దాటింది. 10 మంది మరణించారు. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగా 37 మంది మాత్రమే రికవరీ అయ్యారు. రోజు రోజుకు విస్తరిస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. 

కరోనా వైరస్‌ ప్రపంచ యుద్ధాలకంటే తీవ్రమైన ఆందోళన రేపుతోందని మోదీ పేర్కొన్నారు. మొత్తం మానవజాతినే ప్రమాదంలోకి నెట్టేసిందని మోదీ వ్యాఖ్యానించారు. గత రెండు నెలలుగా ఈ సంక్షోభం ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తోందన్నారు. అయితే ఈ విషయంలో భారతదేశం విజయం సాధిస్తుందని  ప్రధాని భరోసా ఇచ్చారు. ప్రజల్లో భయాందోళనలు రేగడం సహజం. కానీ ప్రజలు అప్రమత్తంగా వుండి, ఈ వైరస్‌ బారినుంచి సురక్షితంగా బయటపడవచ్చు అని ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. 

మనం ఆరోగ్యంగా వుంటే.. ప్రపంచం ఆరోగ్యంగా వుంటుంది. సంకల్పం, అప్రమత్తత మాత్రమే కరోనాకు మందు అని ప్రధాని  సూచించారు. గత ఆదివారం జనతా కర్ఫ్యూ విధించారు. తెలంగాణలో 24 గంటల పాటు కర్ఫ్యూ సాగింది. మోడీ ఆలోచనకు అంతర్జాతీయంగాప్రశంసలు లభించాయి. అనంతరం కేంద్రం దేశంలోని వివిధ జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించాలని కోరగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించాయి. 

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   34 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   27 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle