newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

21-02-202021-02-2020 18:16:48 IST
2020-02-21T12:46:48.498Z21-02-2020 2020-02-21T12:46:45.481Z - - 15-04-2021

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశం ధర్మసత్రం కాదని ఎవరు పడితే వారు వచ్చి ఇక్కడ పౌరసత్వం తీసుకుంటామంటే ఒప్పుకునేది లేదని రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. అందుకే కేంద్రం పౌరసత్వ సవరణ పేరిట ప్రత్యేక చట్టం తెచ్చిందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్‌కు  వచ్చిన హిందువులందరికీ దేశ పౌరసత్వం ఇస్తారని అదేసమయంలో భారత్‌లో పుట్టిన ముస్లింలకు సీఏఏ ఏ మాత్రం వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలోని సావిత్రిబాయిపూలే ఆడిటోరియంలో అఖిల భారత విద్యార్థి పరిషత్‌ హెచ్‌సీయూ శాఖ ఆధ్వర్యంలో‘ సీఏఏ– ఏ హిస్టోరికల్‌ ఇంప్యారిటివ్‌ బియాండ్‌ కాంటెంపరరీ పాలిటిక్స్‌’ అంశంపై ఆయన ప్రత్యేక ఉపన్యాసం చేశారు. 

ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ.. సీఏఏ చట్టం ఎవరికో వ్యతిరేకంగా తీసుకురాలేదని, భారత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ అనుకూలంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం భారత్‌లో పుట్టిన ఏ మతానికి వ్యతిరేకం కాదని కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని, చట్టంలో లోపాలు ఉన్నాయని, ఒక మతానికి వ్యతిరేకమని నిరూపించాలని ఆయన చాలెంజ్‌ చేశారు. రోహింగ్యాలు స్వాతంత్య్ర సమయంలో బర్మాకు వెళ్ళేందుకు సిద్దపడి వినతిపత్రాలు ఇచ్చారని, ఆ తర్వాత 1949లో పాకిస్తాన్‌ వెళ్తామని చెప్పారని, కానీ ఎప్పుడు కూడా ఇండియాలోకి వస్తామని చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. ఇజ్రాయిల్‌కు చెందిన పార్సీలు, ఆంగ్లో ఇండియన్లు కూడా ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారని, ఆంగ్లో ఇండియన్లకు చట్టసభల్లో ప్రత్యేక సభ్యత్వం ఇచ్చారన్నారు. భారత దేశం అన్ని కులాలకు, మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 

వచ్చే పదేళ్లలో భారత్‌ బలమైన ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తుందని స్వామి అన్నారు. 2020–21 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల వృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ప్రజ్ఞా భారతి’ ఆధ్వర్యంలో  హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన 2030 నాటికి  ‘బలమైన ఆర్థిక శక్తిగా భారత్‌’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.  స్వాతంత్రం నాటి నుంచి 1990 వరకు భారత్‌ అంతగా అభివృద్ధి చెందలేదని, ఏడాదికి 3.5 శాతం మాత్రమే జీడీపీ వృద్ధి సాధించిందన్నారు. ఇందుకు  జవహర్‌ లాల్‌ నెహ్రూ విధానాలే కారణమని ఆరోపించారు. 

నెహ్రూ సోవియట్‌ ఆర్థిక విధానాల కారణంగానే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తిరిగి పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంతో ఏడాదికి 8శాతం జీడీపి వృద్ధి సాధించిందన్నారు. అనంతరం వచ్చిన మన్మోహన్‌ సింగ్‌ కూడా వాటిని కొనసాగించారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తున్నారని, నిరుద్యోగ నిర్మూలన, పేదరిక నిర్మూలనపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. ఏడాదికి 10శాతం వృద్ధితో వచ్చే పదేళ్లలో భారత్‌ చైనాను అధిగమిస్తుందన్నారు.

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   43 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   15 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   19 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   20 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle