newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భారత్, అమెరికా సహజ మిత్రులు.. పెట్టుబడులు పెట్టండి.. మోదీ ఆహ్వానం

23-07-202023-07-2020 09:36:15 IST
2020-07-23T04:06:15.729Z23-07-2020 2020-07-23T04:06:12.591Z - - 20-04-2021

భారత్, అమెరికా సహజ మిత్రులు.. పెట్టుబడులు పెట్టండి.. మోదీ ఆహ్వానం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్-అమెరికా సహజ మిత్రులని, తమ రెండు దేశాల మధ్య సంబంధాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌ పట్ల యావత్‌ ప్రపంచం ఆశావాహ దృక్పథంతో ఉందని ప్రధాని అన్నారు. ఆర్థిక సంస్కరణల విషయంలో మౌలిక మార్పులు తీసుకొచ్చినందున భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి అమెరికా కంపెనీలు ముందుకు రావాలంటూ మోదీ ఆహ్వానం పలికారు. 

యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నేతృత్వంలో జరిగిన ఇండియా ఐడియాస్ సదస్సును ఉద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా అనేక రంగాల్లో సడలింపులు ఇచ్చామని, బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐకి అనుమతిచ్చామని మోదీ గుర్తు చేశారు. 

రక్షణ రంగంలోనూ అలాగే అంతరిక్ష రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలని సూచించారు. రక్షణ రంగంలో ఏకంగా 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. టెక్నాలజీ, మౌలిక వసతుల కల్పన రంగంలో కూడా పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. 

ఇళ్లు, రోడ్లు, హైవేలు, పోర్టుల నిర్మాణంలో భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు. భారత్-అమెరికా సహజ మిత్రులన్న ప్రధాని ఆత్మనిర్భర్ భారత్‌ కోసం అమెరికా తోడ్పాటు అవసరమని చెప్పారు. 

ప్రభుత్వం ఇన్వెస్టర్లకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని, పెట్టుబడుల వృద్ధికి తమ దేశంలో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, రక్షణ, విద్యుత్‌, వ్యవసా యం, బీమా, అంతరిక్ష పరిశోధనా వంటి రంగా ల్లో పెట్టుబడులకు, వృద్ధికి అవకాశాలున్నాయని తెలిపారు.  

బుధవారం జరిగిన ఇండియా-ఐడియాస్‌ సదస్సులో భాగంగా ప్రధాని కీలకోపన్యాసం చేశారు. 

కాగా జీ-7 దేశాల సదస్సుకు ప్రధాని మోదీని అమెరికా ఆహ్వానించింది. ‘ఇండియా-ఐడియాస్‌’ సదస్సులో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఈ విషయం తెలిపారు. భారత్‌, అమెరికాల మధ్య సంబంధాల్లో ఇది కొత్త యుగం అని ఆయన అభివర్ణించారు. భారత దేశ భద్రతకు అమెరికా అండగా ఉంటుందన్నారు. బ్లూ డాట్‌ నెట్‌వర్క్‌ను మెరుగుపరిచేందుకు భారత్‌తో కలిసి అమెరికా పని చేస్తుందని చెప్పారు. బహిరంగ వాణిజ్యాన్ని భారత్‌ మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   13 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   17 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   14 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   21 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   15 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle