newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భారత్‌పై కరోనా కరాళ నృత్యం.. 3 లక్షల 54 వేల మార్క్ దాటిన కేసులు

17-06-202017-06-2020 11:38:15 IST
Updated On 17-06-2020 14:36:01 ISTUpdated On 17-06-20202020-06-17T06:08:15.664Z17-06-2020 2020-06-17T06:07:41.507Z - 2020-06-17T09:06:01.709Z - 17-06-2020

భారత్‌పై కరోనా కరాళ నృత్యం.. 3 లక్షల 54 వేల మార్క్ దాటిన కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్ కరోనా వైరస్ కాటుకి బలై విలవిల్లాడుతోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 11 వేలు దాటింది  కరోనా మృతుల సంఖ్య. కేసులు 3 లక్షల 54 వేల మార్క్ ని దాటడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ బులిటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు :  3, 54, 065కి చేరాయి. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 1,55,227 వున్నాయి. కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన బాధితులు 1,86,935గా వున్నాయి. దేశం మొత్తం కరోనాతో మృతుల సంఖ్య 11, 903కి చేరాయి. 

ఎండాకాలం ముగిసి వానాకాలం రావడంతో ఉష్ణోగ్రతల్లో మార్పులు జరిగాయి. దీంతో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.  కరోనా కేసులు పెరుగుతుండటంతో దానికి తగిన విధంగా ఇండియాలో ఆసుపత్రులు, వైద్య సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు.   ఉన్న వైద్య సిబ్బందికి కూడా కరోనా సోకుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని, లేదంటే వైరస్ బారిన పడాల్సి వస్తుందని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.  అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తేనే కరోనాను అదుపుచేయగలమని ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. 

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న ఇప్పటి వరకు మరణాల రేటు అదుపులోనే ఉంది.  కానీ, గడిచిన 24 గంటల్లో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.  రోజు రెండు వందలు లేదంటే మూడు వందలకు మించి కరోనా మరణాల సంఖ్య ఉండేది కాదు.  కానీ, గడిచిన 24 గంటల్లో ఏకంగా 2003  కరోనా మరణాలు సంభవించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.  అత్యధికంగా మహారాష్ట్రలో 1409, ఢిల్లీలో 437 మరణాలు సంభవించాయి. కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా  పెరుగుతుండటంతో కరోనా కట్టడి, లాక్ డౌన్ పై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.  

మోడీ ఇప్పటికే కొంతమంది ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. రెండవరోజు ఇవాళ కూడా సీఎం కరోనా కేసులు ఎక్కువగా వున్న రాష్ట్రాల సీఎం అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కరోనా సంక్షోభంపై జరగనున్న ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌కు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  హాజరుకావడం లేదు. ఈ సమావేశానికి హజరయ్యే ముఖ్యమంత్రుల జాబితాలో మమతా బెనర్జీ పేరు లేకపోవడం చర్చకు దారితీస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశానికి  ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ సిన్హా హజరు కానున్నట్లు రాష్ట్ర సచివాలయ వర్గాలు తెలిపాయి. 

Image

కేంద్ర మరోసారి బెంగాల్‌ను అవమానించింది. రాష్ట్ర సీఎం మమతను మాట్లాడకుండా చేసేందుకే ఆహ్వానం ఇవ్వలేదని టీఎంసీ నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రులను తమ సమస్యలను తెలియజేయడానికి అనుమతించకపోతే వీడియో సమావేశాల పేరిట సమావేశాలు వృధా అంటూ బెంగాల్ విద్యాశాఖ మంత్రి పారా ఛటర్జీ ట్వీట్ చేశారు. 

బీజేపీయేతర పాలిత ప్రాంతాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఇప్పటికే కరోనా వైరస్‌పై పోరాటం, అంఫాన్‌ తుపాన్‌ కారణంగా బెంగాల్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని మమత పేర్కొన్నారు. అంఫాన్ తుపాను సాయం గురించి మమత పట్టుబడుతుందనే ఆమెకు ఆహ్వానం పంపలేదంటున్నారు టీఎంసీ నేతలు. పశ్చిమ బెంగాల్‌తో పాటు బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాకుండా ఆయా రాష్ట్రా ప్రతినిధులు మోదీ సమావేశానికి హజరు కానున్నారు. ఈసమావేశంలో ఏం చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

 

 

 

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle