భారతీయ ఔషధాల కోసం ప్రపంచం ఎదురుచూపులు
11-04-202011-04-2020 08:52:39 IST
Updated On 11-04-2020 10:43:04 ISTUpdated On 11-04-20202020-04-11T03:22:39.341Z11-04-2020 2020-04-11T03:22:20.484Z - 2020-04-11T05:13:04.291Z - 11-04-2020

హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారసిటమాల్.. ప్రపంచమంతా ఈ మందుల కోసమే పడిగాపులు కాస్తోంది. ఔషధాల ఉత్పత్తిలో భారత్ ఎంతో ముందుంది. ముఖ్యంగా భారత్‌లో ఉత్పత్తయ్యే పలు ఔషదాలపై ప్రపంచ దేశాలన్నీ ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ పలు ఔషదాల ఎగుమతులపై నిషేధం విధించడంతో భారత్‌పై ఆధారపడ్డ దేశాలన్నీ కోరుతున్నాయి. ఇటీవల హైడ్రాక్సీక్లోరోక్విన్‌కు ప్రపంచ దేశాల నుంచి విపరీతమైన డిమాండ్ రాగా ఇప్పుడు తమ దేశాలకు పారాసెటమాల్ పంపించాలని వివిధ దేశాలు భారత్‌ను కోరుతున్నాయి. కరోనా వైరస్‌కు విరుగుడుగా ఎటువంటి ఔషదం, వ్యాక్సన్ ఇంకా కనుగోనలేదు. ప్రస్తుతం వివిధ దేశాలకు చెందిన వైద్యులు, శాస్త్రవేత్తలు ఇదే పనిలో ఉన్నారు. కొన్ని పరిశోధనలు ఇప్పడిప్పుడే ఓ కొలిక్కి వస్తున్నాయి. కానీ, ఎంత వేగంగా జరిగినా కనీసం కరోనాకు విరుగుడు అందుబాటులోకి రావడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న హైడ్రాక్సీక్లోరోక్విన్, పారాసెటమాల్ వంటి మందులను వాడి కరోనాను నయం చేస్తున్నారు. అయితే, మన దేశంలోనూ కరోనా ముప్పు ఉన్నందున ఈ మందులకు కొరత రాకుండా ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించింది. మలేరియా కోసం వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను తమ దేశాలకు పంపించాలని ఇప్పటికే అమెరికా, బ్రెజిల్ సహా 30 దేశాలు ప్రధాని నరేంద్ర మోడీని కోరుతున్నాయి. దీంతో ఆయా దేశాలతో ఉన్న సంబంధాల మేరకు ఎగుమతులకు కొంత సడలింపు ఇచ్చింది ప్రభుత్వం. హైడ్రాక్సిక్లోరోక్విన్ తర్వాత ఇప్పుడు పారాసెటమాల్ కోసం పలు దేశాలు భారత్ వైపు ఆశగా చూస్తున్నాయి. జ్వరం, నొప్పులకు విరుగుడుగా పారాసెటమాల్ వాడుతుంటాం. కరోనా వైరస్ బారిన పడిన వారికి కూడా ఈ సమస్యలు ఉంటాయి. దీంతో కరోనా చికిత్సకు అంతర్జాతీయంగా పారాసెటమాల్ ఉపయోగిస్తున్నారు. పారాసెటమాల్‌ను భారత్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. ఏటా రూ.730 కోట్ల విలువైన 5,300 మెట్రిక్ టన్నుల పారాసెటమాల్‌ను భారత్ విదేశాలకు ఎగుమతి చేస్తోంది. అమెరికా, యూకే, ఇటలీ, స్పెయిన్, జర్మనీ వంటి దేశాలకు భారత్ నుంచే పారాసెటమాల్ ఎగుమతి అవుతుంది. ఇప్పుడు పారాసెటమాల్ ఎగుమతిని భారత్ నిషేధించడంతో ఆయా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. తమ దేశానికి పారాసెటమాల్ పంపించాలని ఇప్పటికే దక్షిణ కొరియా, అమెరికా, కెనెడా, శ్రీలంక సహా పలు యూరోప్ దేశాలను భారత్‌ను కోరాయి. ప్రపంచదేశాల విజ్ఞప్తి మేరకు కరోనాపై ఉమ్మడిగా పోరాడేందుకు మానవతా దృక్పథంతో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేసేందుకు కేంద్ర పాక్షికంగా సడలింపులు ఇచ్చింది. ఇప్పుడు మనం తయారుచేస్తున్న పారాసెటమాల్ విషయంలోనూ ఇటువంటి నిర్ణయమే తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రపంచ దేశాలను కరోనా నుంచి ఆదుకునే ఔషదాలను భారత్ ఉత్పత్తి చేస్తుండటం అయితే గొప్ప విషయమే.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
10 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
14 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
11 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
15 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
13 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
18 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
17 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
20 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
16 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
21 hours ago
ఇంకా