newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భయపడకండి, జాగరూకతే కరోనాకు విరుగుడు: మోదీ హితవు

14-03-202014-03-2020 13:39:24 IST
2020-03-14T08:09:24.331Z14-03-2020 2020-03-14T08:09:21.205Z - - 14-04-2021

భయపడకండి, జాగరూకతే కరోనాకు విరుగుడు: మోదీ హితవు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా భయాలు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రజల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. కరోనాపై ఆందోళన చెందవద్దని, అప్రమత్తతే దానికి సరైన విరుగుడు అని ట్వీట్‌ చేశారు. తగు జాగ్రత్తలు తీసుకుకుని కరోనానను తరిమేద్దామని ఆయన ట్విటర్‌ వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు. దాంతోపాటు ఆయన దేశవాసులకు పలు కీలక సూచనలు చేశారు.

కోవిడ్‌-19 వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుందామని ఆయన పేర్కొన్నారు. ఒకేచోట అందరూ గుమికూడవద్దని ప్రధాని సూచించారు. వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గిద్దామని అన్నారు. కొన్నిరోజులపాటు మంత్రులెవరూ విదేశాల్లో పర్యటించబోరని ఆయన తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చర్యల్లో భాగంగానే పర్యాటక వీసాలు రద్దు చేశామని ఆయన స్పష్టం చేశారు. 

కాగా, గురువారం సాయంత్రం నాటికి దేశ వ్యాప్తంగా 73 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ప్రపంచవ్యాప్తంగా ఆ సంఖ్య 1,26,273 ఉండటం ఆందోళనకరం.

కాగా,  దేశవ్యాప్తంగా కరోనా (కోవిడ్‌-19) వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ బారినపడకుండా ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు బాధితులకు సత్వర వైద్య చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 

ఈక్రమంలోనే  కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లోని ఉద్ధంపూర్‌లో 100 పడకలు గల 4 ఐసోలేషన్‌ వార్డులు సిద్ధమయ్యాయని ట్విటర్‌ వేదికగా కేంద్రం వెల్లడించింది. ఉద్ధంపూర్‌లోని కమాండ్‌ ఆస్పత్రిలో ఈ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. కరోనా అనుమానితులకు చికిత్స అందించేందుకు స్పెషలిస్టు డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. 

కాగా, గురువారం రాత్రి 9 గంటల వరకు దేశ వ్యాప్తంగా 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ప్రపంచవ్యాప్తంగా ఆ సంఖ్య 1,28,872 కు చేరడం ఆందోళనకరం.

కరోనా వైరస్‌  భయాందోళన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు సినిమాహాళ్లను మూసివేయాలని ఆదేశించింది. అలాగే పరీక్షలు నిర్వహించని స్కూళ్లు, కాలేజీలను కూడా  మార్చి 31 వరకు మూసి వేసేందుకు నిర్ణయించింది. కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్‌ కేజ్రీవాల్‌  ఒక ప్రకటన జారీ చేశారు.  

ప్రధానంగా జన సమూహాలను నిలువరించే చర్యల్లో  భాగంగా ఢిల్లీ ప్రభుత్వం తాజా ఆదేశాలిచ్చింది. మరోవైపు కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య గురువారం నాటికి 73 కి చేరింది. కేరళలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle