newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బ‌ల‌హీన‌త‌లు స‌రే.. బ‌లాలను చూడ‌లేరా..?

16-11-201916-11-2019 09:37:38 IST
Updated On 16-11-2019 16:19:29 ISTUpdated On 16-11-20192019-11-16T04:07:38.953Z16-11-2019 2019-11-16T04:06:34.424Z - 2019-11-16T10:49:29.108Z - 16-11-2019

బ‌ల‌హీన‌త‌లు స‌రే.. బ‌లాలను చూడ‌లేరా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఓ వ్య‌క్తి జ్ఞానాన్ని, సామ‌ర్థ్యాన్ని, తెలివితేట‌ల‌ను, నాయ‌క‌త్వ‌ప‌టిమ‌ను అత‌డి మాట‌ల‌ను బ‌ట్టి, ప్ర‌సంగించే తీరును బ‌ట్టి అంచ‌నా వేయ‌లేము. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప నాయ‌కులుగా కీర్తించ‌బ‌డిన వారిలో చాలా మంది ఆక‌ట్టుకునే ప్ర‌సంగాలు చేయ‌లేరు.

మ‌న రాష్ట్రంలోనూ నాయ‌కుడిగా నిరూపించుకున్న నేత‌లు గొప్పగా, అబ్బుర‌ప‌రిచే ప్ర‌సంగాలు చేయ‌లేరు. అయితే, కేవ‌లం ప్ర‌సంగాన్ని బ‌ట్టి ఒక రాజ‌కీయ నేత‌పై వ్య‌క్తిగ‌త దాడి చేయ‌డం, రాజ‌కీయాల‌కు ప‌నికిరాడ‌నే ముద్ర వేయ‌డం స‌రికాదు.

కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ త‌ర్వాత రాహుల్ గాంధీ భావి నేత అవుతార‌నేది అంద‌రికీ తెలిసిందే. అయితే, ప్ర‌త్య‌ర్థి పార్టీ రాజ‌కీయంగా, వ్యూహాత్మ‌కంగా ఆయ‌న హావ‌భావాలు, ప్ర‌సంగం తీరును అవ‌హేళ‌న చేస్తూ రాహుల్ గాంధీ రాజ‌కీయాల‌కు అస‌మ‌ర్థుడు అనే ఇమేజ్‌ను సృష్టించారు.

సోష‌ల్ మీడియా ప్ర‌భావం మొద‌ల‌వుతున్న‌ప్పుడే ఈ ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన ప్ర‌త్య‌ర్థులు రాహుల్ గాంధీని ప‌ప్పు అని ప్ర‌చారం చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. కానీ, రాహుల్ గాంధీ ఆలోచ‌న‌లు ఉన్న‌తంగా ఉంటాయ‌ని, ఆయ‌న ఓపిక, స‌హ‌నం క‌లిగిన నాయ‌కుడ‌ని ఆయ‌న‌ను ద‌గ్గ‌ర నుంచి చూసే వారు చెబుతుంటారు.

త‌న నాన‌మ్మ‌, తండ్రి హ‌త్య‌కు గుర‌య్యార‌ని, త‌న కుటుంబానికి ముప్పు ఉంద‌ని తెలిసి కూడా ఆయ‌న ఎటువంటి భ‌యం లేకుండా సామాన్య ప్ర‌జ‌ల్లోకి వెళ్తారు. కానీ, ఆయ‌న‌పై వేసిన ప‌ప్పు అనే ముద్ర రాహుల్‌లోని సానుకూల‌త‌ల‌ను ప్ర‌జ‌లు అర్థం చేసుకోకుండా అడ్డుప‌డుతోంది. అందుకే మోడీని ఢీ కొట్టే నేత‌గా రాహుల్‌ను చూడ‌టం లేదు.

ఇప్పుడు ఇదే ప‌రిస్థితి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌నిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి చంద్ర‌బాబు నాయుడు త‌ర్వాత భ‌విష్య‌త్ నేత నారా లోకేష్ ఇది గుర్తించిన ప్ర‌త్య‌ర్థి పార్టీలు రాహుల్ గాంధీని ఎలాగైతే అస‌మ‌ర్థుడిగా చూపించారో ఇక్క‌డా అదే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తున్నారు. మొద‌టి నుంచి ఇంగ్లీష్ మీడియంలో, విదేశాల్లో చ‌దివిన లోకేష్ ప్ర‌సంగాల్లో త‌డ‌బ‌డ‌తారు. కానీ, గ‌తానికి ఇప్పటికి ఆయ‌న ప్ర‌సంగాలు మెరుగ‌య్యాయి.

అయినా, ప్ర‌సంగాల్లో త‌డ‌బాట్లను పెద్ద‌విగా చూపిస్తూ లోకేష్‌ను ప‌ప్పు అనే ముద్ర వేస్తున్నారు. లోకేష్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ ఇది కొన‌సాగుతున్నా ఇటీవ‌లి కాలంలో బాగా పెరిగింది.

ఇటీవ‌ల వైసీపీ అంటే ప్రేమ, చంద్ర‌బాబు అంటే ద్వేషం చూపించే ద‌ర్శ‌కుడు తీస్తున్న సినిమా ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఒక వ్య‌క్తిని ఇంత‌లా టార్గెట్ చేసి వ్య‌క్తిగ‌తంగా అవ‌హేళ‌న చేయ‌డం రాహుల్ గాంధీ, లోకేష్ విష‌యంలోనే జ‌రుగుతోంది.

అయితే, లోకేష్ ప్ర‌సంగాల్లో వెనుక‌బ‌డుతున్నా రాజ‌కీయ వ్యూహాలు ర‌చించ‌డంలో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనేది టీడీపీ నేత‌లు మాట‌. ఈ ఐదేళ్ల కాలంలో ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ 2గా లోకేష్ వ్య‌వ‌హ‌రించారు.

పార్టీ వ్య‌వ‌హారాల‌నూ లోకేష్ చ‌క్క‌బెట్టేవారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల సంక్షేమం కోసం లోకేష్ ఎక్కువ‌గా ఆలోచిస్తార‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. ఆయ‌న నిర్వ‌హించిన శాఖ‌లకు అనేక అవార్డులు వ‌చ్చాయంటే అది లోకేష్ ప‌నితీరుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు.

మంగ‌ళ‌గిరిలో ఓడిపోయినందుకు రాజ‌కీయాల‌కు లోకేష్ ప‌నికిరాడ‌ని అనుకుంటే చంద్ర‌బాబు నాయుడు కూడా చంద్ర‌గిరిలో ఓడిపోయారు. త‌ర్వాత త‌న రాజ‌కీయ చాణ‌క్యంతో రాష్ట్రంలో సుదీర్ఘ‌కాలం ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన నేత‌గా మారారు.

ప్ర‌తీ ఒక్క‌రికీ బ‌లం, బ‌ల‌హీన‌త‌లు ఉన్న‌ట్లే లోకేష్ ప్ర‌సంగాలు బ‌ల‌హీనంగా ఉన్నంత మాత్రాన ఆయ‌న సామ‌ర్థ్యాన్ని త‌క్కువ అంచ‌నా వేయ‌డం స‌రికాద‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి.

లోకేష్‌ను ఇంత‌లా టార్గెట్ చేయ‌డం, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తుండ‌టం, అస‌మ‌ర్థుడ‌నే ముద్ర వేయ‌డం మాత్రం దిగ‌జారిపోతున్న రాజ‌కీయ విలువ‌ల‌కు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. అయితే, ఈ విష‌యంలో టీడీపీ కూడా ఏమీ త‌క్కువ కాదు.

జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా దెబ్బ‌కొట్ట‌డానికి ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన నాటి నుంచి అనేక ప్ర‌చారాలు చేస్తూనే ఉంది. వాటిని చేదించి జ‌గ‌న్ నాయకుడిగా నిరూపించుకున్నారు. రేపు లోకేష్ కూడా నిరూపించుకోలేర‌నే గ్యారంటీ లేదు.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle