newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బ్రేకింగ్... యూపీలో ఎన్ కౌంటర్.. వికాస్ దూబె హతం

10-07-202010-07-2020 08:14:50 IST
Updated On 10-07-2020 13:26:18 ISTUpdated On 10-07-20202020-07-10T02:44:50.972Z10-07-2020 2020-07-10T02:44:46.124Z - 2020-07-10T07:56:18.251Z - 10-07-2020

బ్రేకింగ్... యూపీలో ఎన్ కౌంటర్.. వికాస్ దూబె హతం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ్యాంగ్ స్టర్ జీవితాలు పోలీసులతో ఆడుకున్నంత కాలం బాగానే వుంటాయి. పోలీసుల్ని రెచ్చగొడితే గ్యాంగ్ స్టర్ల జీవితాలు ఎప్పుడు అంతమవుతాయో తెలీదు. సినిమా స్టయిల్ లో దేశంలోనే సంచలనం రేపిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబె కథ విషాదాంతం అయింది. యూపీలో 8మంది పోలీసులను కాల్చి చంపిన వికాస్ దూబ పోలీసు తూటాలకు బలయ్యాడు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఆలయంలో పోలీసులకు చిక్కిన వికాస్ దూబె.. ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్ప్ పోలీసుల చేతిలో ఎన్ కౌంటరయ్యాడు.

యూపీ నుంచి కాన్పూర్ కు తరలిస్తుండగా కాన్వాయ్ లోని ఓ వాహనం బోల్తాపడింది. దీంతో వికాస్ దూబె పారిపోయేందుకు తీవ్ర యత్నం చేశాడు. దీంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో వికాస్ దూబె మరణించినట్టు యూపీ పోలీసులు నిర్దారించారు. 

ఉజ్జయిని ఆలయంలో దర్శనానికి వెళ్లిన వికాస్ దూబెని పోలీసులు అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ పోలీసులు యూపీ పోలీసులకు తెలిపారు. ఉజ్జయిని నుంచి వికాస్ దూబెను యూపీకి తరలించారు. అక్కడినుంచి కాన్పూర్ తరలించే సమయంలో ఈ సంఘటన జరిగింది. వికాస్ దూబె ప్రధాన అనుచరులిద్దరు ఇంతకుముందే పోలీసుల ఎన్ కౌంటర్లో హతమయిన సంగతి తెలిసిందే. 

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే అనుచరుడు ప్రభాత్‌ విశ్రాను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులు.నిన్న ఫరీదాబాద్‌ ప్రభాత్‌ మిశ్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అతడిని ఎన్ కౌంటర్ చేశారు. అంతకుముందు గ్యాంగ్‌ స్టర్‌ వికాస్‌ దూబేను పట్టుకోవడానికి నాలుగురోజుల నుంచి కష్టపడుతున్న ఉత్తరప్రదేశ్‌ పోలీసులు బుధవారం విజయం సాధించారు. వికాస్‌ దూబే ప్రధాన సహాయకుడు అమర్‌ దూబేని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో బుధవారం ఉదయం అమర్‌ దూబేను ప్రత్యేక పోలీసులు కాల్చి చంపినట్టు సమాచారం. అతని డెడ్ బాడీ కూడా బయటకు వచ్చింది.  కాన్పూర్‌ ఘటనలో ప్రధాన నిందితుల్లో ఒకరైన అమర్‌ దూబే బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని ఉత్తరప్రదేశ్‌ అదనపు డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తానికి వికాస్ దూబె, అతని అనుచరుల కథ ఎన్ కౌంటర్ తో ముగిసింది. 

బ్రేకింగ్ : మధ్యప్రదేశ్ పోలీసులకు చిక్కిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబె

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   7 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   10 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   13 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   14 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle