newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

బ్రేకింగ్: ఔరంగాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం...16మంది వలస కూలీల మృతి

08-05-202008-05-2020 08:39:28 IST
Updated On 08-05-2020 11:50:23 ISTUpdated On 08-05-20202020-05-08T03:09:28.350Z08-05-2020 2020-05-08T03:08:32.128Z - 2020-05-08T06:20:23.995Z - 08-05-2020

బ్రేకింగ్: ఔరంగాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం...16మంది వలస కూలీల మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో వరుస ప్రమాదాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో 16 మంది వలస కూలీలు చనిపోయారు. మృతి చెందినవారిలో చిన్నారులు కూడా ఉన్నారు. కర్మాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్‌పై వలస కూలీలు నిద్రస్తుండగా, వారిపై నుంచి గూడ్స్‌ రైలు వెళ్ళినట్లు ప్రాథమిక సమాచారం. 

ఔరంగబాద్ కర్మాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్‌ రైలు దూసుకెళ్లింది.ఈప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో, ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న వలస కార్మికులుగా గుర్తించారు. పట్టాలపై నిద్రిస్తున్న వారిని రైలు వేగంగా ఢీకొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. 

కర్మాడ్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వలస కార్మికులు గూడ్స్‌రైలును రాకను గమనించకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆర్పీఎఫ్‌, రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి బయల్దేరారు.

లాక్‌డౌన్‌ వల్ల పలువురు వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లే క్రమంలో.. రైల్వే ట్రాక్‌లపై నడుచుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే  బాధిత కూలీలు నిత్యం తమ స్వస్థలాలకు వెళ్లేందుకు రైల్వే ట్రాక్ లను ఉపయోగిస్తున్నారు. కాస్త దూరం నడిచి అలసిపోతున్నవారంతా ఆ ట్రాక్ లపైనే నిద్రిస్తున్నారు. పాసింజర్ రైళ్ళ రాకపోకలు లేకపోయినా గూడ్స్ రైళ్ళు దేశవ్యాప్తంగా తిరుగుతున్న సంగతి తెలిసిందే. నిద్రలో వున్నవారంతా రైలు వచ్చిన అలికిడి వినపడక మృత్యుతీరాలకు చేరిపోయారు. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోంది. 

మహారాష్ట్రలో జరిగిన రైలు ప్రమాదంలో 16 మంది మృతిచెందడం విచారకరం. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం తరఫున మృతుల బంధువులను ఆదుకుంటామన్నారు.

24 గంటల వ్యవధిలోనే నాలుగు ప్రమాదాలు జరిగాయి. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకై 12 మంది చనిపోయారు. వందలాదిమంది గ్యాస్ ప్రభావానికి లోనై అస్వస్థతకు గురయ్యారు. ఛత్తీస్ ఘడ్ లోని  రాయ్‌గఢ్‌ పేపర్ మిల్లు కూడా ప్రారంభమయింది. గురువారం మధ్యాహ్నం మిల్లులోని ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఏడుగురు కార్మికులు వెళ్లారు. ట్యాంకులోకి దిగి శుభ్రం చేస్తున్న క్రమంలో గ్యాస్ లీకై అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీసులు అక్కడికి చేరుకొని.. కార్మికులను ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. 

ఇవే కాకుండా రాత్రి తమిళనాడులోని నైవేలీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 10మంది కార్మికులు గాయపడ్డారు. కడలూరు జిల్లా నైవేలీ థర్మల్‌ ప్లాంట్‌ రెండో యూనిట్‌లో గురువారం సాయంత్రం ఒక బాయిలర్‌ అకస్మాత్తుగా పేలి, మంటలు చెలరేగాయి.

 

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle