బ్రిటిష్ హయాంలోని చట్టంతో ఇప్పుడు కరోనాపై పోరాటం
24-03-202024-03-2020 07:32:30 IST
2020-03-24T02:02:30.940Z24-03-2020 2020-03-24T02:02:18.419Z - - 12-04-2021

రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంక్షలు అమల్లోకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు మరికొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎపిడెమిక్స్ డిసీసెస్ యాక్ట్ - 1897 చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చాయి. 123 ఏళ్ల క్రితం బ్రిటీష్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టంతో ఇప్పుడు మన ప్రభుత్వాలు కరోనా మహమ్మారితో పోరాడుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. వైరస్ బాధితుల సంఖ్య నాలుగు వందలకు చేరువలో ఉంది. ఇప్పటికే ఏడుగురు కరోనా బారిన పడి మరణించారు. ఈ దశలో కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఇటలీ, ఇరాన్ వంటి దేశాల అనుభవాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ఎక్కువగా ఇళ్లకే పరిమితం చేయడం, కరోనా వైరస్ అనుమానితులను గుర్తించి, సాధారణ ప్రజల నుంచి వేరు చేసి, ఐసోలేషన్ చేయడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో బ్రిటీష్ హయాంలో తెచ్చిన 1897 ఎపిడెమిక్ డిసీసెస్ యాక్ట్‌ను ప్రభుత్వాలు బయటకు తీశాయి. 1890లలో అప్పటి బాంబే ప్రసిడెన్సీలో ప్లేగూ వ్యాధి విజృంభించింది. బాంబే ప్రసిడెన్సీలోనే ఈ వ్యాధి మొదలైన త్వరలోనే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. దీంతో ఈ వ్యాధిని నిర్మూలించడానికి కొన్ని ఆంక్షలు విధించాలని అప్పటి ప్రభుత్వం భావించి 1897 ఎపిడెమిక్ డిసీసెస్ యాక్ట్‌ను రూపొందించింది. ప్లేగూ వ్యాధి కారణంగా బాంబే ప్రసిడెన్సీలో నివసించే ప్రజలు ఈ వ్యాధి లేని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం ప్రారంభించారు. దీంతో ఆయా ప్రాంతాలకు కూడా వ్యాధి సోకింది. దీనిని అరికట్టేందుకు ప్రజలపై ఈ యాక్ట్ ద్వారా అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఆంక్షలు విధించాల్సి వచ్చింది. ఎప్పుడైనా వ్యాధులు ప్రభలుతున్నప్పుడు సాధారణంగా అమలులో ఉన్న నిబంధనలు సరిపోవు అనుకున్నప్పుడు, వ్యాధిని అదుపు చేయడానికి మరికొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎపిడెమిక్ డిసీసెస్ యాక్ట్ - 1897ను అమలు చేసే అధికారం ఉంటుంది. ఈ చట్టం ప్రకారం వ్యాధిని నిరోధించడానికి ఆంక్షలు విధించవచ్చు. ఈ ఆంక్షలు పాటించని వారిని శిక్షించడానికి కూడా ఈ చట్టం ద్వారా అవకాశం ఉంది. 2009లో పూణేలో స్వైన్ ఫ్లూ వ్యాపించినప్పుడు, 2015లో చండీఘడ్‌లో మలేరియా విజృంభించినప్పుడు ఈ చట్టాన్ని అక్కడి వరకు అమలు చేశారు. 2018లోనూ గుజరాత్‌లోని వడోదర జిల్లాలో వఘోడియా తాలుకాలో కలెరా అనుమానిత కేసులు నమోదైనప్పుడు కూడా అక్కడి జిల్లా కలెక్టర్ ఈ చట్టం కింద పలు ఆంక్షలు విధించారు. ఇప్పుడు తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలు కూడా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కఠిన ఆంక్షలు విధించేందుకు ఈ చట్టాన్ని ప్రయోగించాయి. ఈ చట్టం స్థానంలో గతంలో మన ప్రభుత్వాలు కొన్ని మార్పులతో కొత్త చట్టాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా కుదరలేదు. దీంతో 123 ఏళ్ల కింది చట్టం ఇప్పుడు ఉపయోగించాల్సి వచ్చింది.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
9 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
13 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
16 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
6 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
16 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
14 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
16 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
17 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
11 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
19 hours ago
ఇంకా