బ్రిటన్‌లో లాక్ డౌన్ పొడిగింపు... జూన్ 1 వరకూ ఆంక్షలే
11-05-202011-05-2020 09:11:58 IST
Updated On 11-05-2020 09:34:22 ISTUpdated On 11-05-20202020-05-11T03:41:58.635Z11-05-2020 2020-05-11T03:41:52.027Z - 2020-05-11T04:04:22.017Z - 11-05-2020

కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ను జూన్ 1 వరకు పొడిగిస్తున్నట్టు యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఈ వారంలో లాక్డౌన్ ఎత్తవేయలేమని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. ఒక సందేశంలో బోరిస్ జాన్సన్ జూన్ 1 నుంచి కొన్ని ప్రాథమిక పాఠశాలలు, దుకాణాలను తెరుచుకుంటాయని చెప్పారు. జూలై 1 నుంచి బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు సడలిస్తామని ఆయన చెప్పారు. అయితే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం తప్పనిసరి అని తెలిపారు. లాక్డౌన్ ఎత్తివేతను వ్యూహాత్మకంగా అమలు చేస్తామని జాన్సన్ చెప్పారు. యూకేలో కరోనా పెరిగిపోతోంది. మరణాల విషయంలో బ్రిటన్ ఇప్పుడు అమెరికా తరువాత ఉంది. ఈ కారణంగానే ఇప్పట్లో లాక్డౌన్ ఎత్తివేయబోమని అన్నారు. కేసులుపెరిగితే ఆంక్షలు పెంచుతామని జాన్సన్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆ దేశంలో 219,183 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 31,855 మంది మృత్యువాతపడ్డారు. ఏది ఏమైనా జూన్ 1 నుంచి కొన్ని పాఠశాలలు, దుకాణాలు తెరుచుకుంటాయన్నారు. ఇక జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలకు మాత్రం జూలై 1 తర్వాతనే అనుమతిస్తామన్నారు. అటు విదేశాల నుంచి ఎవరైనా బ్రిటన్ వచ్చినట్లయితే.. వారు తప్పకుండా క్వారంటైన్ నియమాలు పాటించాలని ప్రధాని స్పష్టం చేశారు. అలాగే వర్క్ ఫ్రం హోమ్ చేయలేని వారు కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వర్తించవచ్చని ప్రకటించారు. కానీ అన్ని ప్రాంతాల్లో తప్పనిసరిగా బౌతిక దూరం పాటించాలని ఆదేశించారు. బ్రిటన్‌తో పాటు వేల్స్, స్కాట్లాండ్ దేశాల కూడా లాక్డౌన్ నిబందనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ‘స్టే ఎట్ హోం’ నినాదంతో పాటు ‘స్టే సేఫ్టీ’ నినాదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకురావాలని అధికారులకు ప్రధాని సూచించారు. జూన్ మొదటి వారంలోపు పరిస్థితి అదుపులోకి వస్తే పాఠశాలతో పాటు ఆస్పత్రుల్లో ఓపీ సేవలను ఓపెన్ చేసేలా వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
10 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
13 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
13 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
14 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
11 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
a day ago

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా