newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

బెంగాల్ బీజేపీలో కదనోత్సాహం

11-06-201911-06-2019 07:30:56 IST
Updated On 24-06-2019 12:47:15 ISTUpdated On 24-06-20192019-06-11T02:00:56.969Z11-06-2019 2019-06-11T02:00:23.819Z - 2019-06-24T07:17:15.190Z - 24-06-2019

బెంగాల్ బీజేపీలో కదనోత్సాహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప‌శ్చిమ బెంగాల్ బీజేపీ మ‌హా ఉత్సాహంగా ఉంద‌ట‌. మొన్న‌టి పార్లమెంట‌రీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత దూకుడు పెంచిన ఆ పార్టీ నేత‌లు, 2021లో జ‌ర‌గ‌నున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల మీద దృష్టి పెట్టార‌ట‌. వీలైనంత మంది ఇత‌ర పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను పార్టీలో చేర్చుకుంటున్న బీజేపీ,

బెంగాల్ అసెంబ్లీలోని మొత్తం 294 సీట్ల‌లో 250 సీట్లను టార్గెట్ చేసింద‌ట‌. తాము అధికారంలోకి వ‌స్తే ఉద్యోగాల క‌ల్ప‌న‌, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుతో పాటు చొర‌బాటు దారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బీజేపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నార‌ట‌. 

ముఖ్యంగా జాతీయ జ‌న‌గ‌ణ‌న చ‌ట్టాన్ని క‌చ్చితంగా అమ‌లు చేయ‌డ‌మే త‌మ ప్ర‌ధాన ఎజెండాగా ప్ర‌చారం చేస్తున్నారు బీజేపీ నేత‌లు. మొన్న‌టి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో 40.5 శాతం ఓట్ షేరింగ్ సాధించిన బీజేపీ, ప్ర‌స్తుతం అసెంబ్లీలోని త‌మ ఆరుగురు ఎంఎల్ఏలు, 18 ఎంపీల‌తో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో మోడ‌ల్ చూపిస్తామ‌ని చెబుతున్నారు బెంగాల్ బీజేపీ ఇంచార్జ్ కైలాష్ విజ‌య‌వ‌ర్గియా.

2014 నుంచీ టీఎంసీ త‌న ప్ర‌భావం కోల్పోతూ వ‌స్తోంద‌నీ, ఇక కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు అంతంత మాత్రంగానే మిగిలాయ‌ని అంటున్నారు. 2014 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మొత్తం 42 సీట్ల‌లో 34 సాధించిన టీఎంసీ, ఈ ఎన్నిక‌ల్లో 22 సీట్ల‌తోనే స‌రిపెట్టుకుంది. ఇక 2014లో నాలుగు ఎంపీ సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి రెండు సీట్లు గెల్చుకుంటే, 2014లో రెండు సీట్లు సాధించిన సీపీఎం ఈసారి అస‌లు ఖాతా తెర‌వ‌కుండానే స‌ర్దుకుంది. 

దీంతో, బీజేపీకి 2021లో జ‌రిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఎంసీ మాత్ర‌మే పోటీ అని తేలిపోయింది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ నేత‌ల మీద దృష్టి సారించారుల బెంగాల్ బీజేపీ పెద్ద‌లు. జ‌నంలో మంచి పేరు, ఎన్నిక‌ల్లో గెలిచే స‌త్తా ఉన్న వారినే పార్టీలో చేర్చుకుంటామ‌నీ, ఎవ‌రిని ప‌డితే వారిని పార్టీలో చేర్చుకుని కార్య‌క‌ర్త‌ల‌ను ఇబ్బంది పెట్ట‌మ‌ని చెబుతున్నారు. 

బెంగాల్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ క్యాడ‌ర్ మార్చే ఆలోచ‌న‌లో ఉన్న బీజేపీ, నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఏ,బీ,సీ,డీ విభాగాలుగా విభ‌జించింది. పార్టీకి ప‌ట్టుండి, గెలుస్తామ‌న్న ధీమా ఉన్న 130 సీట్ల‌ను ఏ విభాగంలో చేర్చింది బీజేపీ. అలాగే టీఎంసీతో పోటీప‌డి మార్జిన్ మెజార్టీతో అయినా గెలిచే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్న 65 సీట్ల‌ను బీ విభాగంలో చేర్చింది. ఇక పోటీ ఇచ్చి రెండో స్థానం ద‌క్క‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను సీ విభాగంలో, మూడోస్థానంలో ఉండే సీట్ల‌ను డీ విభాగంలో చేర్చింది బీజేపీ అధిష్టానం. 

అయితే ప్ర‌ధానంగా ఏ,బీ,సీ విభాగ‌ల మీదే తాము దృష్టి పెడుతున్న‌ట్లు చెబుతున్నారు బెంగాల్ బీజేపీ ఇంచార్జ్ కైలాష్ విజ‌య వ‌ర్గ‌రియా. మ‌రో విష‌యం ఏంటంటే, సింగూర్ టాటా మోటార్స్ ప్లాంట్ ఏర్పాటు మీద ప్ర‌ధాన దృష్టి పెట్టిన బీజేపీ, స‌రిహ‌ద్దు జిల్లాల్లో పౌర‌సత్వ బిల్లు మీద ప్ర‌చారం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle