బెంగాల్ పాలిటిక్స్నే మార్చేసిన ఒక్క నినాదం
14-05-201914-05-2019 07:40:12 IST
Updated On 28-06-2019 12:40:57 ISTUpdated On 28-06-20192019-05-14T02:10:12.090Z14-05-2019 2019-05-14T02:06:28.731Z - 2019-06-28T07:10:57.479Z - 28-06-2019

ఆ ఒక్క నినాదం పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని తరాలుగా మార్చేస్తోంది. 1977 దాకా బెంగాల్ అధికారాన్ని తమ చేతిలో ఉంచుకున్న కాంగ్రెస్, బెంగాల్ కాంగ్రెస్ పార్టీలను ఆ నినాదం అడ్డంగా ముంచేసింది. 1960లో అమెరికా, వియత్నాం యుద్ద సమయంలో వియత్నాం ప్రజలకు సంఘీభావంగా కామ్రేడ్లు బెంగాల్లోని పలు పట్టణాల్లో ర్యాలీలు తీశారు. అప్పుడు వారు చేసిన నినాదం తుమారా నామ్, హమారా నామ్ వియత్నాం, వియత్నాం. అంటే నీ పేరు, నా పేరు వియత్నాం, వియత్నాం. ఇది ఆ రోజుల్లో జనానికి బాగా ఎక్కింది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య పాలనతో విసిగిన జనం, నెమ్మదిగా కమ్యూనిస్టుల వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత పలుమార్లు రాష్ట్రపతి పాలన దిశగా బెంగాల్ రాజకీయం నడిచినా, 1977లో సీపీఎం నాయకత్వంలో కామ్రేడ్ల పాలన మొదైలంది. 2011 దాకా అది కొనసాగింది. ఈ సుదీర్ఘ పాలనకు నాంది పలికింది వియత్నాం నినాదమే. ఇక కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలకు వ్యతిరేకంగా 1998 జనవరి 1వ తేదీన మమత బెనర్జీ స్థాపించిన ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, 2006లో అప్పటి సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. సింగూర్ అంశాన్ని తీసుకున్న ఆమె తీవ్రస్థాయిలో ఉద్యమం చేశారు. అప్పట్లో ఆమె ఓ స్లోగన్ ప్రచారం చేస్తూ జనంలోకి వెళ్లారు. ఆ నినాదం ఏంటంటే, తుమారా నామ్, హమారా నామ్ నందిగ్రామ్, నందిగ్రామ్. ఈ నినాదం ఆ పార్టీకి ఎక్కడలేని బలం ఇచ్చింది. ఇలా జనంలో ఎదిగిన టీఎంసీ, 2011లో అధికారంలోకి వచ్చి, ఇప్పటి దాకా కొనసాగుతోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడంతో సీపీఎం నేతలు మొదట్లో టీఎంసీలోకి మారారు. కానీ తాజా పరిస్థితులతో వారు ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నారు. దీనికి కారణం ఒక్కటే, మోడీ ప్రధాని అయిన తర్వాత పశ్చిమ బెంగాల్ మీద పట్టుకోసం అమిత్ షా వ్యూహం రచించారు. ఇక 2017లో బీజేపీ, సంఘ్ పరివార్ ఓ నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లారు. అదేమంటే, తుమారా నామ్, హమారా నామ్ జై శ్రీరాం, జై శ్రీరాం. ఇది సగటు బెంగాలీలకు బాగా ఎక్కింది. ఎందుకంటే ముస్లింల ఓట్లు కోసం 2016లో మమత బెనర్జీ తీసుకున్న నిర్ణయాలు, బడ్జెట్ కేటాయింపులు బెంగాలీలకు ఆగ్రహం తెప్పించింది. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలను వెళ్లగొడతానంటూ ప్రచారం చేసిన మమత, తాను సీఎం అయిన తర్వాత వారికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని బెంగాలీలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదే సమయంలో సంఘ్ పరివార్ తుమారా నామ్, హమారా నామ్ జై శ్రీ రాం, జై శ్రీ రాం నినాదానికి చాలా మంది అభిమానులు అయ్యారు. ప్రజల నాడిని కనిపెట్టిన చాలా మంది సీపీఎం నేతలు ఇప్పుడు 2018 నుంచీ బీజేపీలోకి క్యూ కడుతున్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెల్సుకున్న సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య, వారించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటి పోయింది. ఇక మోడీ మీద కోపంతో ఉన్న మమత బెనర్జీ ఈ మార్పులను గమనించలేదు. పైగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంటే చాలన్న ధీమా ఆమెను ఈ పరిణామాలను తేలిగ్గా తీసుకునేలా చేసింది. దీంతో మొన్నటి స్థానిక సంస్ధల ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన స్థానాలు గెల్చుకుంది. కామ్రేడ్లు మూడో స్థానానికి పడిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీగా రాజకీయం నడుస్తోంది. మొత్తానికి సంఘ్ పరివార్ నినాదం ఇప్పుడు బెంగాల్ సోషల్ మీడియాలో వైరల అవుతోంది. ఈ ఎన్నికల్లో అది బీజేపీకి ఏ మేరకు లబ్ది చేకూరుస్తుంది అనేది ఫలితాల తర్వాత తేలనుంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
13 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
10 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
12 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
16 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
19 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
20 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా