newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బెంగాల్ పరిణామాలపై ఈసీ సీరియస్.. ప్రచారం కుదింపు

16-05-201916-05-2019 07:46:39 IST
Updated On 27-06-2019 17:45:12 ISTUpdated On 27-06-20192019-05-16T02:16:39.379Z16-05-2019 2019-05-16T02:16:28.317Z - 2019-06-27T12:15:12.782Z - 27-06-2019

బెంగాల్ పరిణామాలపై ఈసీ సీరియస్.. ప్రచారం కుదింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పశ్చిమబెంగాల్ పరిణామాలపై ఈసీ సీరియస్ అయింది. పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచార సమయాన్ని కుదిస్తూ ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఏడో విడత ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రానికి ముగియాల్సి ఉండగా, హింసాత్మక ఘటనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో మాత్రం గురువారం రాత్రికి కుదిస్తూ ఈసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఇలాంటి ఉత్తర్వులివ్వడం భారత ఎన్నికల చరిత్రలోనే తొలిసారి. బెంగాల్‌లో గురువారం రాత్రి 10 గంటలకు ప్రచార గడువు ముగుస్తుందని డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ చంద్ర భూషణ్‌ తెలిపారు. ఆ తర్వాత ప్రచారం నిర్వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. 

బెంగాల్‌లోని 9 నియోజకవర్గాలకు ఆదివారం చివరి విడత పోలింగ్‌ జరగనుంది. కోల్‌కతాలో మంగళవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ర్యాలీ సందర్భంగా బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనిపై రాజకీయ దుమారం రేగింది. బెంగాల్‌లో హోం శాఖ ముఖ్య కార్యదర్శి అత్రి భట్టాచార్య, సీఐడీ అదనపు డీజీ రాజీవ్‌లను పదవుల నుంచి తొలగించాలని ఈసీ ఆదేశించింది. 

బెంగాల్‌లో స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు, అభ్యర్థులందరికీ సమానావకాశాలు కల్పించేందుకు అవసరమైన సహకారం రాష్ట్ర అధికారుల నుంచి దక్కడం లేదని ఈసీ భావించింది. తత్వవేత్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ విగ్రహం ధ్వంసం కావడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఈసీ, దుండగులను త్వరలోనే పట్టుకుంటారని తాము ఆశిస్తున్నట్లు పేర్కొంది.

ఈసీ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రచారం గడువును తగ్గించాల్సినంత తీవ్రమైన పరిస్థితులు బెంగాల్‌లో ఉంటే బుధవారం రాత్రికే ప్రచారానికి ఈసీ తెరదించాల్సిందని కాంగ్రెస్‌ పేర్కొంది. బెంగాల్‌లో గురువారం ప్రధాని మోదీ ప్రచారం చేయాల్సి ఉందనీ, ఆయన కార్యక్రమానికి ఆటంకం కలగకూడదనే గురువారం రాత్రి ప్రచారాన్ని ముగించాలని ఈసీ ఆదేశాలిచ్చిందంటూ కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ ఆరోపించారు. మరోవైపు మోదీ సభల కోసమే గడువును గురువారం రాత్రి 10 గంటల వరకు ఈసీ ఇచ్చిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ఆరోపించారు. ఈసీ నిర్ణయంపై దీదీ మండిపడ్డారు. 

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   32 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   25 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle