newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బెంగళూరులో లాక్ డౌన్.. సీఎం కార్యాచరణ

13-07-202013-07-2020 07:50:28 IST
Updated On 13-07-2020 08:17:09 ISTUpdated On 13-07-20202020-07-13T02:20:28.373Z13-07-2020 2020-07-13T02:20:24.709Z - 2020-07-13T02:47:09.605Z - 13-07-2020

బెంగళూరులో లాక్ డౌన్.. సీఎం కార్యాచరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్నాటక కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రోజురోజుకీ విజృంభిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి బెంగళూరు నగరంతో గ్రామీణ జిల్లాల్లో వచ్చే మంగళవారం నుంచి వారం రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించనున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎలా నిర్వహించాలి, మినహాయింపులు ఏం ఇవ్వాలనే విషయాలపై కావేరి అతిథి గృహంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి  యడియూరప్ప సమావేశమై చర్చించారు. 

మంత్రి ఆర్‌.అశోక్, బీబీఎంపీ కమిషనర్‌ అనిల్‌కుమార్, ఐఏఎస్‌ అధికారి రాజేంద్రకుమార్‌ కటారియా తదితరులు హాజరయ్యారు. కరోనా నియంత్రణకు ఏం చేయాలనేదానిపై సుదీర్ఘంగా చర్చించారు. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎం మంత్రులు, అధికారులకు స్పష్టంచేశారు. అయితే ఇతర జిల్లాల్లో కూడా లాక్‌డౌన్‌ విధిస్తే బాగుంటుందనే అంశం ప్రస్తావనకు వచ్చింది.

దీనిపై సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం తెలిపారు. తన సిబ్బందికి కరోనా రావడంతో ఆయన స్వచ్ఛంద క్వారంటైన్‌ను పాటిస్తున్నారు. బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ నియంత్రణపై సీయం ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 

మరోవైపు కరోనా కేసుల తీవ్రతపై కర్నాటక వైద్య ఆరోగ్యశాఖమంత్రి శ్రీరాములు కీలక ట్వీట్ చేశారు. పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేశారు. రాబోయే 15 నుంచి 30 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు అవుతాయని  మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. రాబోయే రెండు నెలలు కరోనాకు అడ్డుకట్టవేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతుంది.

అయితే ప్రజలు ఎటువంటి భయాందోళలకు గురికావాల్సిన పనిలేదు. సవాళ్లను అధిగమించడానికి అందుకు సంబంధించిన అన్ని రకాల చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. కర్నాటకలో  కోవిడ్‌-19 కేసుల సంఖ్య 38342కి చేరుకుంది. మరణాల సంఖ్య  686కి చేరుకుంది. ఇప్పటివరకూ 15411మంది కరోనా బాధితులు చికిత్స అందుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ కేసుల విషయంలో కర్నాటక టాప్ 10లో వుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle