బుద్ధిగా ఉంటావా.. చిదంబరం గతి పట్టించాలా?.. మమతపై బీజేపీ నేత ఫైర్..!
16-09-201916-09-2019 10:13:37 IST
2019-09-16T04:43:37.389Z16-09-2019 2019-09-16T03:57:20.803Z - - 12-04-2021

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మార్గాన్ని సరిచేసుకోవాలని లేకుంటే కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం లాగా జైల్లో కూర్చోవడానికి సిద్ధంగా ఉండాలని ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మల్యే తీవ్రంగా హెచ్చరించారు. జాతీయ పౌర రిజిస్టర్ను వ్యతిరేకిస్తున్న మమతా భారత దేశాన్ని వదిలి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కావాలని వ్యాఖ్యానించారు.
యూపీలోని బైరియా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మల్యే సురేంద్ర సింగ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. జాతీయ పౌర రిజిస్టర్కు వ్యతిరేకంగా మమతా చేసిన ప్రకటనలు చూస్తే ఆమెకు విదేశీ శక్తుల మద్దతు ఉందని స్పష్టమవుతోందని సురేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.
తనకు చెడ్డరోజులు దాపురించాయన్న వాస్తవాన్ని మమత మర్చిపోయినట్లు కనిపిస్తోంది. ఆమె తన భాషను, ప్రవర్తనను మార్చుకోకపోతే కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరంకు పట్టిన గతే తనకూ పడుతుందని సురేంద్రసింగ్ హెచ్చరించారు. అస్సాంలో జాతీయ పౌర రిజిష్టర్ తుది జాబితా ఆగస్టు 31న వెలువడింది. ఈ జాబితా 19 లక్షల మందిని అస్సామేతరులుగా ప్రకటించింది. దేశమంతా దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంట్లో భాగంగా సెప్టెంబర్ 13న కోల్కతాలో జరిగిన ర్యాలీలో మమతా పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో అలాంటి సర్వేను కేంద్రం చేపట్టడానికి తానెన్నడూ అమలు చేయనివ్వనని మమత వ్యాఖ్యానించారు.
యూపీ ఎమ్మెల్యే మమత ప్రకటనను దుయ్యబట్టారు. మమత బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులను కాపాడాలనుకుంటే, ఆమె బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కావాలని సూచించారు. మమత తన మాటతీరును, నడతను మార్చుకోకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో అధికారం చేతులు మారకతప్పదని హెచ్చరించారు. ఇష్టప్రకారం మాట్లాడుతూ వచ్చిన పి. చిదంబర్ను చూసయినా మమత పాఠాలు నేర్చుకోవాలని యూపీ ఎమ్మేల్యే హితవుపలికారు.



జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
6 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
9 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
12 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
13 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
16 hours ago
ఇంకా