newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బీహార్ లో నితీష్ పట్టు సడలుతోందా?

26-10-201926-10-2019 14:34:53 IST
2019-10-26T09:04:53.264Z26-10-2019 2019-10-26T09:04:27.003Z - - 12-04-2021

బీహార్ లో నితీష్ పట్టు సడలుతోందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీహార్ లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పట్టు సడలుతోందా? బీజేపీ - జేడీయూ కూటమికి గడ్డుకాలం ఎదురవ్వనుందా? రాష్ట్రంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నది. ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. అదే సమయంలో ఇటీవలి కాలంలో అన్ని విధాలుగా నీరసపడి, నిర్వీర్యంగా మారిన విపక్ష ఆర్జేడీకి ఈ ఉప ఎన్నికల ఫలితాలు కొత్త ఊపిరి ఇచ్చాయని చెప్పక తప్పదు. 

ఈ ఉప ఎన్నికలలో ఆర్జేడీ రెండు స్థానాలలో విజయం సాధించగా, అధికార జేడీయూ మూడు సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. 2015 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ మొత్తం 53 స్థానాల్లో విజయం సాధించగా మరో స్థానం ఆ పార్టీ ఖాతాలో పడింది. తాజా ఉప ఎన్నికల ఫలితాల తరువాత కూడా బీజేపీకి అసెంబ్లీలో తన స్థానాలలో ఎటువంటి మార్పూ లేదు. ఆర్జేడీ తన బలాన్ని 81 స్థానాలకు పెంచుకుంది. ఇక జేడీయూ బలం 71కి పడిపోయింది. 

ఈ ఫలితాలు ఇప్పటికిప్పుడు జేడీయూ-బీజేపీ కూటమి సర్కార్ కు ఎటువంటి ముప్పూ తీసుకురాలేదు కానీ...ఆ కూటమి పునాదులు కదులుతున్నాయన్న సంకేతాన్ని మాత్రం ఇచ్చాయని చెప్పాలి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు నిరాశనే మిగిల్చాయి. బీహార్ అసెంబ్లీలో ఆ పార్టీకి ఇప్పుడు ఉన్నవి 26 స్థానాలు మాత్రమే.  ఈ ఉప ఎన్నికలలో విశేషంగా చెప్పుకోవలసింది మాత్రం ఎంఐఎమ్ రాష్ట్రంలో ఖాతా తెరవడాన్ను. కిషన్ గంజ్ స్థానంలో అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం విజయం సాధించింది.

ఉప ఎన్నికల ఫలితాల తరువాత జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించిన తీరే ఫలితాల పట్ల ఆయన అసంతృప్తికి నిదర్శనం అని విశ్లేషకులు చెబుతున్నారు. పట్టిన పట్టు విడవక పోవడం...ప్రతి పరిణామాన్నీ తన ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడంలో దిట్ట అయిన నితీష్ కుమార్ కు రాష్ట్రంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించాయనడంలో సందేహం లేదు. అందుకే ఉప ఎన్నికల ఫలితాలకు బాధపడటం లేదని ముక్తసరిగా ఒక ప్రకటన జారీ చేసి మిన్నకున్నారాయన. 

ఈ ఐదు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలో జేడీయూ నాలుగు స్థానాలలో పోటీకి దిగింది. వీటిలో సిమ్రీ బఖ్తియార్ పూర్, బెల్హార్ నియోజకవర్గాలలో ఆ పార్టీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ఈ రెండు స్థానాలనూ విపక్ష ఆర్జేడీ గెలుచుకుంది. మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి...ఆ అభ్యర్థి కూడా ఆర్జేడీ రెబల్  చేతిలో పరాజయం పాలైంది.

పోటీ చేసిన నాలుగు స్థానాలలోనూ అధికార జేడీయూ గెలిచినది నాథ్ నగర్ నియోజకవర్గంలో మాత్రమే. రాష్ట్రంలో రానున్న రోజులలో జేడీయూ, బీజేపీలకు గడ్డు కాలం తప్పదన్న సంకేతాన్ని ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఇచ్చాయి. ఇక రాష్ట్రంలోని కిషన్ గంజ్ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా ఎంఐఎం ఉనికి చాటింది. బీహార్ లో తొలి సారిగా ఎంఐఎం అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నది. ఈ విజయం రాష్ట్రంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనే శక్తుల ఐక్యతకు శ్రీకారం చుడుతుందనడంలో సందేహం లేదు.

మొత్తం మీద  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి, ఆ పార్టీ మిత్రపక్షాలకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి.  ముఖ్యంగా బీహార్ లో పనైపోయిందని అంతా భావిస్తున్న ఆర్జేడీకి ఈ ఉప ఎన్నికల ఫలితాలు నూతన ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్ని కలుగ జేశాయనడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అప్పటికి ఆర్జేడీ బలోపేతమవుతుందన్న సంకేతం ఈ ఫలితాలు ఇచ్చాయి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle