newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

బీహార్లో ఆరోదశ పోలింగ్ బీజేపీకి ప్లస్సేనా?

10-05-201910-05-2019 13:02:44 IST
Updated On 29-06-2019 12:18:16 ISTUpdated On 29-06-20192019-05-10T07:32:44.806Z10-05-2019 2019-05-10T07:32:20.325Z - 2019-06-29T06:48:16.598Z - 29-06-2019

బీహార్లో ఆరోదశ పోలింగ్ బీజేపీకి ప్లస్సేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ నెల 12వ తేదీన జ‌రిగే ఆరో ద‌శ పోలింగులో బీహార్ రాష్ట్రంలో 8 సీట్లకు ఎన్నిక‌లు జ‌రుగనున్నాయి. ఈ ఎనిమిది సీట్లలో ఎన్డీయే కూట‌మే గెలిచే అవ‌కాశం ఉన్నట్లు జాతీయ మీడియా అంచ‌నా వేస్తోంది. గోపాల్ గంజ్, వాల్మీకీన‌గ‌ర్, సివాన్, షియోహ‌ర్, పూర్వి చంప్రాన్, మ‌హారాజ్ గంజ్, ప‌శ్చిమ చంప్రాన్, వైశాలి సీట్లలో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 

వీటిలో గోపాల్ గంజ్, వాల్మీకీన‌గ‌ర్, సివాన్ ఎంపీ సీట్లను గ‌తంలో బీజేపీ కైవ‌శం చేసుకుంది. ఈసారి ఆ సీట్లను పొత్తులో భాగంగా జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ పార్టీకి కేటాయించింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ కోర‌డంతో ఆ సీట్లు ఇచ్చార‌ట అమిత్ షా. ఇదంతా ఓ ఎత్తయితే అంద‌రి చూపులు శివాన్ ఎంపీ సీటు మీదే ఉన్నాయ‌ట‌. ఎందుకంటే ఈ సీటు నుంచి ఇద్దరు మాఫియా డాన్‌ల భార్యలు పోటీ ప‌డుతున్నారు. 

ఆర్జేడీ నుంచి షాబుద్దీన్ భార్య హినా సాహెబ్ బ‌రిలో ఉంటే, జేడీయూ నుంచి అజ‌య్ సింగ్ భార్య క‌వితా సింగ్ పోటీ చేస్తున్నారు. షాబుద్దీన్, అజ‌య్ సింగ్ వైరం ఇప్పటిది కాద‌ట‌. తాత‌ల కాలం నుంచి ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య వైరం న‌డుస్తూనే ఉంది. దీంతో ఇప్పుడు శివాన్ ఎంపీ సీటు హాట్ టాపిక్ అయింది. ఇక షియ్నార్ ఎంపీ సీటు మీద కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయ‌ట‌. 

ఎందుకంటే ఈ సీటు నుంచి సిట్టింగ్ బీజేపీ ఎంపీ మీద ఆర్జేడీ అభ్యర్థిగా మాజీ జ‌ర్నలిస్ట్ స‌య్యద్ ఫైజ‌ల్ అలీ బ‌రిలో ఉన్నారు. అయితే ఇత‌నికి లాలూ యాద‌వ్ కుమారుడు తేజ‌స్వీ యాద‌వ్ వ‌ర్గం మ‌ద్దతు ఇస్తుంటే, లాలూ యాద‌వ్ మ‌రో కుమారుడు తేజ్ ప్రతాప్ యాద‌వ్ వ‌ర్గం స‌హ‌క‌రించ‌డం లేద‌ట‌. దీంతో అలీకి ఇబ్బందిగా మారిన‌ట్లు తెలుస్తోంది. 

2014 ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి మొత్తం 40 ఎంపీ సీట్లలో 31 సీట్లు గెల్చుకుంది. బీజేపీ 22, ఎల్జేపీ 6, ఆర్ఎస్ఎస్పీ 3 చోట్ల గెలిచాయి. అయితే ఈసారి ఎన్డీయే నుంచి ఆర్ఎస్ఎస్పీ వైదొలిగి, లాలూ యాద‌వ్ పార్టీతో జ‌త‌క‌ట్టింది. ఇక అధికార జేడీయూ ఎన్డీయేలో చేరింది. ఈ మార్పులతో త‌మ‌కు లాభ‌మే కానీ, ఎలాంటి న‌ష్టం లేద‌నేది బీజేపీ పెద్దలు అంచ‌నా వేస్తున్నార‌ట‌.

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

   9 hours ago


కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

   9 hours ago


‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

   10 hours ago


టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

   10 hours ago


జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

   11 hours ago


హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

   11 hours ago


ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

   13 hours ago


జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

   13 hours ago


దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

   14 hours ago


ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   14 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle