బీజేపీ పవర్ పాలి‘ట్రిక్స్’..నెక్స్ట్ రాజస్థానేనా?
18-03-202018-03-2020 08:09:01 IST
Updated On 18-03-2020 12:49:22 ISTUpdated On 18-03-20202020-03-18T02:39:01.573Z18-03-2020 2020-03-18T02:38:55.306Z - 2020-03-18T07:19:22.570Z - 18-03-2020

రాజకీయాల్లో అవకాశం కోసం చూస్తాయి పార్టీలు. గతంలో అధికారంలో వుండి అధికారానికి దూరమయిన కమలనాథులు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ కంట్లో నలుసులా తయరైంది బీజేపీ. మధ్యప్రదేశ్ సంక్షోభం.. రాజస్థాన్‌లోనూ తలెత్తబోతోందా...? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న విభేదాలను బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకోబోతుందా ? మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత రాజస్థాన్‌పై బీజేపీ ఫోకస్ పెట్టబోతోంది. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ల మధ్య పెరుగుతున్న దూరం..కాంగ్రెస్‌ను కలవరపెడుతుంది. మధ్యప్రదేశ్ గుణపాఠంతో కాంగ్రెస్ మేలుకోకపోతే...రాజస్థాన్ కూడా చేజారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆపరేషన్ కమలం కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీలో అంతర్గతంగా ఉన్న సంక్షోభాన్ని సరైన సమయంలో పరిష్కరించకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తాత్సారం చివరకు ఆ పార్టీ మూల్యం చెల్లుంచుకునే వరకు వస్తోంది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ వర్సెస్ జ్యోతిరాదిత్య సింధియా తరహా రాజకీయాలే రాజస్థాన్‌లోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. బోటాబోటీ మెజార్టీతో ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తోంది. మధ్యప్రదేశ్ తరహాలోనే 20 మంది ఎమ్మెల్యేలు అటు నుంచి ఇటు మారితే అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయం. ఇటు బీజేపీ మధ్యప్రదేశ్ లో సక్సెస్ అయింది. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. పదిహేను నెలల పాటు బీజేపీ నిరీక్షణ ఫలించింది. కరడు గట్టిన కాంగ్రెస్ వాదిగా ముద్రపడిన జ్యోతిరాదిత్య సింధియాను బీజేపీ తమవైపునకు తిప్పుకోగలిగింది. ఇక తర్వాత బీజేపీ లక్ష్యం రాజస్థాన్ మాత్రమే. రాజస్థాన్ లో కూడా ఎన్నికలు జరిగి పదిహేను నెలలు కావస్తోంది. అక్కడ కూడా కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యతతోనే అధికారంలో కొనసాగుతూ వస్తోంది. ఇక్కడ కూడా సేమ్ మధ్యప్రదేశ్ రాజకీయాలే కాంగ్రెస్ లో ఉన్నాయి. వృద్ధనేత అశోక్ గెహ్లాట్ ను ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించింది. రాజస్థాన్ లో ఐదేళ్ల తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ యువనేత సచిన్ పైలెట్ ఉన్నప్పటికీ ఆయనను పక్కన పెట్టింది. సచిన్ పైలెట్ కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిని అప్పగించింది. రాహుల్ కోటరీలో ఉన్న సచిన్ పైలట్ ను కాదని అశోక్ గెహ్లాట్ కు సీఎం పదవి అప్పగించడంపై అప్పట్లోనే పార్టీలో భిన్న స్వరాలు విన్పించాయి. రాజస్థాన్ లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో గత ఎన్నికల్లో 98 మంది మాత్రమే కాంగ్రెస్ నుంచి గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ వంద మాత్రమే. ఇక్కడ కూడా సీపీఎం, ఆర్ఎల్డీ నుంచి ఐదుగురు సభ్యుల మద్దతు ఉంది. బీఎస్పీని తన పార్టీలో కాంగ్రెస్ విలీనం చేసుకుంది. ప్రస్తుతం 112 మంది సభ్యులు మాత్రమే కాంగ్రెస్ కు ఉన్నారు. ఏమాత్రం తేడా వచ్చినా రాజస్థాన్ లో కూడా ప్రభుత్వం కుప్ప కూలిపోవడం ఖాయం. ఇక్కడ బీజేపీకి 80 మంది సభ్యులున్నారు. వజ్రాల వ్యాపారి రాజీవ్ అరోరాను రాజ్యసభకు నామినేట్ చేయడంపై సచిన్ పైలెట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ నేతలను పక్కన పెట్టి వ్యాపారులను రాజ్యసభకు పంపితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని గెహ్లాట్‌కు తన అసంతృప్తిని తెలిపారు. కోటా ఆస్పత్రిలో ఇటీవల సంభవించిన చిన్నారుల మరణాలు కూడా రాజస్థాన్ ప్రభుత్వంలో లుకలుకలను బయటపెట్టాయి. చిన్నారుల మరణాల విషయంలో గెహ్లాట్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని సచిన్ పైలెట్ ఆగ్రహంతో ఉన్నారు. పేరుకు డిప్యూటీ సీఎంగా ఉన్నా... అశోక్ గెహ్లాట్ తీసుకుంటున్న నిర్ణయాలు సచిన్ పైలెట్‌కు రుచించడం లేదు. మరో పదిహేను మందిని తమవైపునకు తిప్పుకుంటే బీజేపీ రాజస్థాన్ లోనూ అధికారంలోకి రావడం ఖాయంగా కన్పిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ మధ్య విభేదాలున్నాయి. రెండు గ్రూపులుగా విడిపోయి ఉన్నారు. ఇక్కడ కూడా మధ్యప్రదేశ్ సీన్ తలెత్తుతుందని కాంగ్రెస్ ఆందోళనలో ఉంది. ఇప్పటికైనా అధిష్టానం చొరవ తీసుకుని రాజస్థాన్ లో పార్టీని చక్కదిద్దకుంటే మరో మధ్యప్రదేశ్ గా మారక తప్పదు. సచిన్ పైలెట్ ను జాగ్రత్తగా చూసుకుంటేనే బెటర్. లేదంటే జ్యోతిరాదిత్య సింధియాలాగే కమలానికి దగ్గరవడం ఖాయం.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
13 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
9 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
11 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
16 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
18 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
19 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా