newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా..?

04-11-201904-11-2019 08:17:29 IST
Updated On 04-11-2019 17:51:14 ISTUpdated On 04-11-20192019-11-04T02:47:29.773Z04-11-2019 2019-11-04T02:47:22.962Z - 2019-11-04T12:21:14.804Z - 04-11-2019

బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వ ఏర్పాటులో ఏర్ప‌డిన అనిశ్చితి ఇంకా కొన‌సాగుతోంది. ముఖ్య‌మంత్రి ప‌దవీకాలాన్ని చేరిస‌గం పంచుకోవాల‌ని శివ‌సేన ప‌ట్టుప‌ట్ట‌డం, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇందుకు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో రెండు పార్టీల మ‌ధ్య దూరం పెరిగింది. దీంతో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి 10 రోజులు గ‌డిచినా ప్ర‌భుత్వ ఏర్పాటు దిశ‌గా అడుగులు ముందుకు ప‌డ‌టం లేదు.

పార్ల‌మెంటు ఎన్నిక‌ల ముందు బీజేపీ త‌మ‌కు 50 50 ప్ర‌తిపాదికన ప‌ద‌వుల పంప‌కం జ‌రుపుకుందామ‌ని హామీ ఇచ్చింద‌ని, అందుకు త‌గ్గ‌ట్లుగానే రెండున్న‌రేళ్ల ముఖ్య‌మంత్రి ప‌ద‌వీకాలాన్ని శివ‌సేన‌కు ఇవ్వాల‌ని, అది కూడా మొద‌టి రెండున్న‌రేళ్లే ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతోంది. బీజేపీ మాత్రం ఇందుకు అంగీక‌రించ‌డం లేదు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ముఖ్య‌మంత్రి అవుతార‌ని ఆ పార్టీ ప్ర‌క‌టించేసింది.

శివ‌సేన‌కు ఒక ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వితో పాటు మ‌రో 13 మంత్రి ప‌ద‌వులు ఇచ్చేందుకు ఆఫ‌ర్ చేసింది. శివ‌సేన ఈ ఆఫ‌ర్‌కు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ప్ర‌భుత్వ ఏర్పాటు దిశ‌గా అడుగులు ప‌డ‌టం లేదు.

ఇదే స‌మ‌యంలో శివ‌సేన గ‌ద్దెనెక్కేందుకు ఎన్‌సీపీ వైపు చూస్తోంది. ఎన్‌సీపీ మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో కాంగ్రెస్ మ‌ద్ద‌తు కూడా తీసుకొని బీజేపీకి షాక్ ఇవ్వాల‌ని భావిస్తోంది. తాము ప్ర‌తిపక్షంలో కూర్చుంటామ‌ని ఎన్‌సీపీ, కాంగ్రెస్ చెబుతున్నా బీజేపీని దెబ్బ‌తీయ‌డానికి శివ‌సేన‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ఆ పార్టీలు సిద్ధ‌ప‌డే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టికే శివ‌సేన‌, ఎన్‌సీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఎన్‌సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అవ్వ‌నున్నారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు శివ‌సేన‌కు బ‌య‌టి నుంచి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీక‌రించ‌వ‌చ్చు.

కాంగ్రెస్‌, ఎన్‌సీపీ మ‌ద్ద‌తు ఇస్తే శివ‌సేన ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం పెద్ద‌గా క‌ష్ట‌మేమీ కాదు. కానీ, బీజేపీ చూస్తూ ఊరుకునే అవ‌కాశం లేదు. ఇప్ప‌టికే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల‌ను బీజేపీ త‌మ‌వైపు తిప్పుకుంది.

ప‌లువురు శివ‌సేన ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కూడా త‌మ‌కు ఉంద‌ని బీజేపీ నేత‌లు ప్ర‌క‌టిస్తున్నారు. ముందు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి త‌ర్వాత అసెంబ్లీలో ఆ పార్టీ బ‌లం చూపించుకునే అవ‌కాశం ఉంది.

ఇదంతా గ‌త ఏడాది క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన క‌ధ‌లానే ఉంది. అక్క‌డ కూడా త‌క్కువ సీట్లు వ‌చ్చినా ముఖ్య‌మంత్రి ప‌ద‌విపై క‌న్నేసిన కుమార‌స్వామి ఏడాదికే దిగిపోవాల్సి వ‌చ్చింది.

మ‌హారాష్ట్ర‌లోనూ కుమార‌స్వామి రూట్‌లో శివ‌సేన వెళుతోంది. నిండా 30 ఏళ్లుగా కూడా లేని ఆధిత్య థాక్రేను ముఖ్య‌మంత్రిని చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా సైద్ధాంతిక విభేదాలున్న పార్టీల‌తోనూ క‌లిసేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

అస‌లే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎట్టి ప‌రిస్థితుల్లో శివ‌సేన‌ను అధికారంలోకి రానిచ్చే అవ‌కాశం లేదు. ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేయ‌వ‌చ్చు.

ఒక వేళ శివ‌సేన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసినా ఐదేళ్లు కొన‌సాగేందుకు బీజేపీ అవకాశం ఇవ్వ‌దు. అయితే, క‌ర్ణాట‌క త‌ర‌హాలో ఎమ్మెల్యేల కొనుగోలు మ‌హారాష్ట్ర‌లో బీజేపీ చేయ‌లేద‌ని శివ‌సేన చెబుతుంది. కానీ, మొత్తం వ్య‌వ‌హారం ఏడాది క్రితం క‌ర్ణాట‌క‌లో జ‌రిగినట్లుగా జ‌రుగుతోంది.       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle