బీజేపీలోకి మరో సీనియర్ హాస్య నటుడు..?
06-12-201906-12-2019 11:03:34 IST
2019-12-06T05:33:34.719Z06-12-2019 2019-12-06T05:33:30.766Z - - 11-04-2021

టాలీవుడ్ సీనియర్ హాస్య నటుడు బ్రహ్మానందం పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడా..? అన్న ప్రశ్నకు అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. వారి వ్యాఖ్యలకు ఆధారంగా కర్ణాటక చిక్కబళ్లాపురంలో బ్రహ్మానందం రాజకీయ ప్రచారాన్ని గుర్తు చేస్తున్నారు. దీంతో ఇంతకీ వెండితెరపై కడుపుబ్బ నవ్వించే బ్రహ్మానందం రాజకీయాల్లోకి వస్తే సినీ జనాల మాదిరే.. ఓటర్లనూ మెప్పించగలుగుతాడా..? అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోంది. ఏదేమైనా చిక్కబళ్లాపురంలో ఓ బీజేపీ అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ బ్రహ్మానందం చేసిన ఎన్నికల ప్రచారం రాజకీయ విశ్లేషకుల్లో హాట్‌టాపిక్ అయింది. అయితే, చిక్కబళ్లాపురంలో తెలుగు వారు అత్యధిక సంఖ్యలో ఉండటంతో బ్రహ్మానందంకు ఘన స్వాగతం లభించింది. తన మిత్రుడి గెలుపు కోసమే ప్రచారం చేసినట్టు మీడియాతో బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. కాగా, గురువారం నాడు చిక్కబళ్లాపురంలో జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థికి మద్దతుగా బ్రహ్మానందం అంతకు ముందు ప్రచారం చేశారు. ఇదిలా ఉండగా బీజేపీ తరుపున ప్రచారం చేసిన టాలీవుడ్ హాస్య నటుల్లో కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ ఇదివరకే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆ రూటులో బ్రహ్మానందం కూడా బీజేపీలో చేరతారన్న ప్రచారం ఓ రేంజ్లో ఊపందుకుంది. ఈ ఎలక్షన్స్‌లో బ్రహ్మానందం జోరుగా ప్రచారం చేశారు. చిక్క బళ్లాపుర నియోజకవర్గంలో నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన డా.సుధాకర్ తరపున ప్రచారం చేశారు. బీజేపీలో చేరటం గురించి మాత్రం బ్రహ్మానందం క్లారిటీ ఇవ్వకుండా మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని దాట వేశారు. సుధాకర్ తనకు స్నేహితుడని, ఆ కారణంగానే ఆయన గెలుపును కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించానని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. బ్రహ్మానందం ఎన్నికల ప్రచారంలో మాంచి జోష్ కనిపించిందనే చెప్పొచ్చు. కాగా, చిక్కబళ్లాపురలో తెలుగు ప్రజల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే, 2018లో చిక్కబళ్లాపురంలో జరిగిన ఎలక్షన్స్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పనిచేసిన కేవీ నవీన్ కిరణ్ తరపున హీరో పవన్‌కల్యాణ్ ప్రచారం చేశారు. ఇప్పుడు అదే నియోజకవర్గంలో క్యాంపెయిన్ చేశారు. సుధాకర్ 2018 ఎన్నికల్లో 82,006 ఓట్లు సంపాదించారు. 51.76 శాతం ఓట్లతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా రాజీనామా, సుప్రీం తీర్పు, ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆంధ్రా సరిహద్దులో ఉన్న చిక్కబళ్లాపురంతోపాలు పలు నియోజకవర్గాల్లో తెలుగు సినీ నటుల ప్రభావం ఎక్కువే. అయితే, ప్రస్తుతం బ్రహ్మానందం ప్రచారానికి స్పందన బాగానే కనిపించింది. అయితే, అది ఓట్ల రూపంలో ఏ మేరకు మారుతుందన్నది వేచి చూడాల్సిన విషయం. బ్రహ్మానందం ప్రచారం సుధాకర్‌కు ఎంతమేర కలిసి వస్తుందో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడక తప్పదు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
5 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
8 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
11 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
an hour ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
11 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
9 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
12 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
12 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
6 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
15 hours ago
ఇంకా