newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బీజేపీకి లాభించిన ఎంఐఎం ఓట్లు!

25-10-201925-10-2019 10:49:27 IST
2019-10-25T05:19:27.374Z25-10-2019 2019-10-25T05:19:23.420Z - - 17-04-2021

బీజేపీకి లాభించిన ఎంఐఎం ఓట్లు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ - ఎన్‌సీపీ కూట‌మిని ఎంఐఎం భారీగానే దెబ్బ‌తీసింది. ఔరంగాబాద్ ప‌రిధిలో ఎంఐఎం ఎఫెక్ట్ బాగానే క‌నిపించింది. ముస్లిం ఓట్ల‌ను గ‌ణ‌నీయంగా చీల్చి కాంగ్రెస్ -  ఎన్‌సీపీ కూట‌మి అవ‌కాశాల‌కు గండి కొట్టింది.

మ‌హారాష్ట్ర‌లో మొత్తం 60 స్థానాల్లో పోటీచేసిన ఎంఐఎం అన్నింటిలోనూ కాంగ్రెస్ - ఎన్‌సీపీతో ముఖా ముఖి త‌ల‌పడింది.  ఔరంగాబాద్‌, బీడ్‌, కొల్హాపూర్‌, అహ్మ‌ద్‌న‌గ‌ర్ వంటిచోట్ల మైనార్టీలు ఎంఐఎంవైపే మొగ్గుచూపారు. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో ఎంఐఎం 1.35శాతం ఓట్లు సాధించింది.

కానీ, ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం ప్ర‌ధాన పార్టీల గెలుపోట‌ముల‌ను ఎంఐఎం శాశించింది. దాదాపు 44 స్థానాల్లో మ‌జ్లిస్ పార్టీ అభ్య‌ర్ధుల‌కు గ‌ణ‌నీయ‌మైన సంఖ్య‌లో ఓట్లు వ‌చ్చాయి. ఒక‌ప్పుడు మైనార్టీ ఓట్లు గంప‌గుత్త‌గా కాంగ్రెస్ పార్టీకే ప‌డేవి. అటు హిందుత్వ కూట‌మిగా బీజేపీ - శివ‌సేన క‌లిసి పోటీచేస్తున్న నేపథ్యంలో మైనార్టీలు స‌హ‌జంగానే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేవారు.

అయితే, మ‌జ్లిస్ పార్టీ పోటీచేయ‌డంతో సీన్ మారింది. కాంగ్రెస్ ఓట్ల‌కు గండిపెట్టింది. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీ ఓట్లు చీల‌డం, బీజేపీ - శివసేన కూట‌మికి వ‌రంగా మారింది. దీంతో కాంగ్రెస్‌కు ప‌ట్టున్న కొన్ని స్థానాల్లోనూ బీజేపీ - శివ‌సేన సుల‌భంగా గెలిచారు.

మొత్తానికి ఎంఐఎం కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసింది. అలాగే బీహార్‌లో కూడా ఎంఐఎం తొలిసారి ఖాతా తెరిచింది. కిష‌న్‌గంజ్ ఉప ఎన్నిక‌లో ఎంఐఎం అభ్య‌ర్ధి గెలుపొందారు. మొత్తానికి తెలంగాణ బ‌య‌ట ఎంఐఎం విజ‌యాలు ఇప్పుడు ఆ పార్టీకి కొత్త జోష్‌ను తీసుకొస్తున్నాయి.

 

 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   11 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   15 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   13 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle