newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బి‘హారర్’ పిడుగుల వాన.. 83 మందికి పైగా బలి

26-06-202026-06-2020 07:31:39 IST
Updated On 26-06-2020 10:45:28 ISTUpdated On 26-06-20202020-06-26T02:01:39.495Z26-06-2020 2020-06-26T02:01:30.150Z - 2020-06-26T05:15:28.125Z - 26-06-2020

 బి‘హారర్’ పిడుగుల వాన.. 83 మందికి పైగా బలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వైరస్ బీభత్సం కలిగిస్తుంటే బీహార్లో భారీవర్షాలకు తోడు పిడుగుల వాన అనేకమందిని బలితీసుకుంటోంది. ఇప్పటివరకూ 83 మంది పిడుగులకు ప్రాణాలు వదిలారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పిడుగులతో భారీ ప్రాణ నష్టం సంభవించడంతో విషాదం నెలకొంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ .4 లక్షలు పరిహారంగా ప్రకటించారు. మమధుబానీలోని మరియు నవాడా, గోపాల్ గంజ్ జిలాల్లో పిడుగులు పడ్డాయి. గోపాల్ గంజ్ లోనే 13 మంది మరణించారు.

రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు పడే అవకాశం ఉందని, పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  పిడుగుపాటు నేపథ్యంలో బీహార్ లోని పలు పాంత్రాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. రేపు కూడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద ఎవరూ నిలబడరాదని అధికారులు హెచ్చరించారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యవసాయపనులకు వెళ్లిన రైతులు పిడుగుపాటుకు బలవుతున్నారు. వేర్వేరు చోట్ల నలుగురు రైతుల మృతి చెందారు. ఏపీలో పిడుగుపాటుకి గురై మరణించిన వారి కుటుంబాలకు 24 గంటల్లో పరిహారం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు.యూపీలోనూ పిడుగుపాటుకు ముగ్గురు మరణించారు.

ఉన్నవ్, ఫతేపూర్, జలాన్ ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. కాగా, పిడుగులు పడి ఒకేరోజు ముగ్గురు మృతిచెందడంపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు.పిడుగుపాట్ల వల్ల గాయపడ్డ క్షతగాత్రులకు సరైన వైద్య సౌకర్యాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి అత్యవసర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

పిడుగుపాటు కారణంగా 83 మంది మరణించడంపై  కాంగ్రెస్‌పార్టీ నేత, ఎంపీ రాహుల్‌గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. ఈ వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. మృతుల కుటుంబాలకు మనోధైర్యం ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. బాధితులను ఆదుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   14 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   11 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   15 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   13 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   17 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   19 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle