newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బార్లకు గ్రీన్ సిగ్నల్...మందుబాబులకు అక్కడ పండుగే

07-08-202007-08-2020 09:30:45 IST
Updated On 07-08-2020 10:40:16 ISTUpdated On 07-08-20202020-08-07T04:00:45.768Z07-08-2020 2020-08-07T04:00:16.460Z - 2020-08-07T05:10:16.605Z - 07-08-2020

బార్లకు గ్రీన్ సిగ్నల్...మందుబాబులకు అక్కడ పండుగే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ ఉధృతి కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. ముఖ్యంగా వ్యాపార కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. అయితే, ప్రభుత్వాలు తమకు మంచి ఆదాయవనరులుగా వున్న మద్యం షాపులను మే నెల నుంచి తెరవడం ప్రారంభించాయి. అన్ లాక్ 3లో భాగంగా మరిన్ని సడలింపులు ఇచ్చినా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బార్లకు అనుమతివ్వలేదు. కానీ మందుబాబులకు అస్సాం ప్రభుత్వం తీపికబురు అందించింది. కరోనా వైరస్ కారణంగా మూతపడిన బార్లను తెరుచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది. 

ఈ మేరకు లైసెన్స్ కలిగిన బార్లకు అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భౌతిక దూరం, మాస్కు ధరించడం వంటి కరోనా నిబంధనలకు లోబడి మద్యం సరఫరా చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే బార్లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

అస్సాం రాష్ట్రంలో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం బార్లను మూసివేసింది. మద్యం షాపులను తెరిచే సమయం కూడా తగ్గించింది. ఈ నెల 5వ తేదీ నుంచి కొన్ని నిబంధనలను సడలించింది. విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్లకు అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించింది. అస్సాంలో  ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల మార్క్ అస్సాంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 50445 కాగా, కోలుకున్నవారి సంఖ్య 35892 గా వుంది. అస్సాంలో కరోనా వల్ల 121 మంది మరణించారు. 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   14 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   18 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   15 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   a day ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   a day ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle