newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బహిరంగ మలవిసర్జన చేశారని దళిత పిల్లల్ని చంపారు. స్వచ్చబారత్ ఇదేనా మోదీజీ?

28-09-201928-09-2019 12:10:05 IST
Updated On 28-09-2019 16:58:03 ISTUpdated On 28-09-20192019-09-28T06:40:05.606Z28-09-2019 2019-09-28T06:39:59.261Z - 2019-09-28T11:28:03.831Z - 28-09-2019

బహిరంగ మలవిసర్జన చేశారని దళిత పిల్లల్ని చంపారు. స్వచ్చబారత్ ఇదేనా మోదీజీ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మధ్యప్రదేశ్‌ లోని శివ్‌పురి జిల్లా భావ్‌ఖేడి గ్రామంలో మొన్న మంగళవారం పదేళ్ల వయసుగల బాలుడు అవినాష్, పన్నెండేళ్ల బాలిక రోషిణిలను బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని ఆగ్రహించి కొట్టి చంపారు. ఆ నిరుపేద దళిత కుటుంబం బతుకీడుస్తున్న గుడిసెను చూస్తే అది మనుషులకు ఆవాసయోగ్యమైనదిగా ఎవరికీ అనిపించదు. దేశంలో నెలకొన్న దుర్భర దారిద్య్రానికి ఆ గుడిసె ఒక ప్రతీక. మట్టి గోడలతో, గడ్డితో కప్పిన పైకప్పు, దానిపై ప్లాస్టిక్‌ షీట్లు ఉన్న ఆ గుడిసెను చూస్తేనే వారెంత దయనీయ స్థితిలో జీవిస్తున్నారో అర్ధమవుతుంది. దానికి విద్యుత్‌ సదుపాయం, మంచినీటి సదుపాయం లేవని వేరే చెప్పనవసరం లేదు.

ఆ పిల్లల తండ్రి మనోజ్‌ వాల్మీకి చెబుతున్న ప్రకారం రోజుకూలీతో జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం మరుగుదొడ్డితో కూడిన ఇంటి నిర్మాణానికి తాము అర్హులమని చాన్నాళ్లక్రితమే దర ఖాస్తు చేసుకుంది. అయితే అంత క్రితం జరిగిన స్వల్ప తగాదా కారణంగా ఇప్పుడు పిల్లల్ని కొట్టి చంపినవారే పంచాయతీలో తమకున్న పలుకుబడిని ఉపయోగించి ఆ కుటుంబానికి మరుగుదొడ్డి రాకుండా అడ్డుకున్నారు.

చిత్రమేమంటే ఆ ఇంటికి మరుగుదొడ్డి లేకున్నా ‘బహిరంగ మలవిసర్జన రహిత’(ఓడీఎఫ్‌) గ్రామంగా అది సర్కారువారి జాబితాలో చోటు సంపాదించుకుంది. నిజానికి మరుగుదొడ్డి మంజూ రైనా దాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి, పరిశుభ్రంగా ఉంచుకోవ డానికి కావలసిన నీటి సదుపాయం... మురుగు పోవడానికి అవసరమైన పైప్‌లైను ఆ ‘ఇంటి’కి లేదు. ఏ కార్యక్రమాలైనా, ఎంత సదుద్దేశంతో ప్రారంభించే పథకాలైనా క్షేత్రస్థాయిలోకొచ్చేసరికి ఎలా నీరుగారుతాయో, అధికారులు వాటిని పైకి రానీయకుండా ఎలా కప్పెడతారో తెలియాలంటే మనోజ్‌ వాల్మీకి ‘ఇల్లే’ ఉదాహరణ. 

దేశంలో ఎక్కడా బహిరంగ మలవిసర్జన అనేది ఉండకూడదని అయిదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ‘స్వచ్ఛ్‌భారత్‌ అభియాన్‌’కి శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు జరిగే 2019 అక్టోబర్‌ 2కల్లా దేశంలోని అందరి ఇళ్లలో మరుగుదొడ్లు ఉండాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం 1.96 లక్షల కోట్ల వ్యయంతో దేశంలోని 55 లక్షల గ్రామాల్లో పది కోట్ల మరుగుదొడ్లు నిర్మించాలన్నది ఈ కార్యక్రమం సారాంశం. దీన్ని ఇప్పటికే మన దేశం అధిగమిం చిందని, గత అయిదేళ్లలో 11 కోట్లకుపైగా మరుగుదొడ్లు నిర్మాణమయ్యాయని గణాంకాలు చెబు తున్నాయి. 

మరుగుదొడ్డి లేకపోవడం వల్ల గ్రామీణప్రాంతాల్లో మహిళలు, బాలికలు పడే ఇబ్బం దులు అన్నీ ఇన్నీ కాదు. వారు వేకువజామునే లేచి తమ కాలకృత్యాలు తీర్చుకోవాలి. లేదా రాత్రి చీకటి పడేవరకూ వేచి ఉండాలి. ఈ క్రమంలో వారికి దుండగుల చేతుల్లో ఎదురవుతున్న అవ మానాలు అన్నీ ఇన్నీ కాదు. పలు సందర్భాల్లో వారు అత్యాచారాలకూ, అపహరణలకూ గురవు తున్నారు. ఆడపిల్లలు బడి చదువులు మానేస్తున్నారు. 2015లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రపంచ దేశాలన్నీ 2030కల్లా సాధించవలసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు(ఎస్‌డీజీ) నిర్ణయించింది. అందులో అందరికీ మంచినీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య వగైరాలున్నాయి.  

మన దేశంలో తరతరాలుగా పారిశుద్ధ్య పనుల్లో ఉంటున్నది దళిత కులాలవారే. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ లోతుగా పాతుకుపోయిన మన సమాజం వారికి ఆ పనులు ‘రిజర్వ్‌’చేసి అందువల్ల లబ్ధిపొందుతున్నది. మానవ వ్యర్థాలను నెత్తిపై మోసుకెళ్లే దుర్భర అవస్థ నుంచి వారిని తప్పిం చాలని సామాజిక కార్యకర్తలు ఎన్నేళ్లనుంచో చేస్తున్న ప్రయత్నాలు ఇంకా పూర్తిగా ఫలించని దయ నీయ స్థితి దేశంలో ఉంది. ఇలా ఇష్టం ఉన్నా లేకున్నా పారిశుద్ధ్య పనుల్లో కొనసాగక తప్పని కులానికి చెందిన పసిపిల్లల్ని ఊరును అపరిశుభ్రం చేస్తున్నారని నిందిస్తూ కొట్టి చంపడం కన్నా దారుణం మరోటి ఉంటుందా?

నిజానికిది పారిశుద్ధ్య సమస్య కాదు. దళితులపట్ల నరనరానా ద్వేషాన్ని పెంచుకున్నవారికి దొరికిన సాకు. దళితుల స్థితిగతులను, వారికెదురవుతున్న వివక్షను పట్టించు కోని పాలకులు ఈ ఘటనకు బాధ్యతవహించాలి. దుండగులను అరెస్టు చేశారు సరే...కానీ ఆ కుటుంబాన్ని దుర్భరస్థితిలోకి నెట్టిన ఇతర పెత్తందార్లను కూడా కటకటాలవెనక్కి నెట్టాలి. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లు గడుస్తున్నా కులం పడగనీడన బతుకీడ్చక తప్పనిస్థితిలో ఉన్న దళితులు తరచుగా వివక్షను ఎదుర్కొనడానికి, కొన్ని సందర్భాల్లో ఆధిపత్య కులాల చేతుల్లో ప్రాణాలు కోల్పోవడానికి చెప్పుకోదగ్గ కారణాలు ఉండవు. కానీ ఇప్పటివరకూ మనకు వినడం అల వాటైన కారణాలను కూడా తలదన్నేలా ఊరిపై పెత్తనం సాగించే సోదరులు ఒక చిన్న విషయంలో దళిత కులానికి చెందిన ఇద్దరు పసిపిల్లల ఉసురు తీశారంటే దిగ్భ్రాంతి కలుగుతుంది.

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2014లో దేశంలో బహిరంగ మలవిసర్జన చేసేవారి సంఖ్య 55 కోట్లు కాగా, 2018–19నాటికి ఈ సంఖ్య 5 కోట్లకు తగ్గింది. ఇదంతా మెచ్చదగ్గదే. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలతో మొదలుపెట్టి అనేక ముఖ్య సందర్భాల్లో మోదీ స్వయంగా స్వచ్ఛభారత్‌ అభియాన్‌ను ప్రచారం చేసిన పర్యవసానంగానే ఇదంతా సాధ్యమైంది. ఇందుకు బిల్‌గేట్స్‌కు చెందిన బిల్, మెలిందాగేట్స్‌ ఫౌండేషన్‌(బీఎంజీఎఫ్‌) ఆయనకు గ్లోబల్‌ గోల్‌కీపర్‌ అవార్డు కూడా అందించింది. 

స్వచ్ఛభారత్ చాలా మంచి కార్యక్రమమే. కాదనలేం.. కానీ బహిరంగ మలవిసర్జన చేశారనే సాకుతో ఇద్దరు దళిత పిల్లలను కొట్టి చంపేసే దేశంలో ఏ పథకమైనా స్వచ్ఛంగా అమలు జరుగుతుందంటే నమ్మవచ్చా మోదీజీ..? 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   3 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   40 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle