newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బలపరీక్షలో నెగ్గుతాం.. గెహ్లాట్ ధీమా.. ఈ వారమే అసెంబ్లీ ప్రత్యేక భేటీ

20-07-202020-07-2020 11:18:59 IST
Updated On 20-07-2020 17:10:27 ISTUpdated On 20-07-20202020-07-20T05:48:59.089Z20-07-2020 2020-07-20T05:48:15.256Z - 2020-07-20T11:40:27.947Z - 20-07-2020

బలపరీక్షలో నెగ్గుతాం.. గెహ్లాట్ ధీమా.. ఈ వారమే అసెంబ్లీ ప్రత్యేక భేటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సచిన్‌ పైలట్‌ తిరుగుబాటుతో హుటాహుటిన జైపూర్‌కు వచ్చిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు గహ్లోత్‌ సర్కారుకు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని తేలిన తరువాత కూడా జైపూర్‌లోనే ఉంటూ వ్యూహ రచన చేస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడడమొక్కటే కాదు..ముఖ్యంగా బీజేపీకి, సచిన్‌ పైలట్‌కు, ఆయన మద్దతుదారులకు సరైన గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో వ్యూహ రచన చేస్తున్నామని చెబుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. గురుగ్రామ్‌లోని రిసార్ట్‌లో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలలోని కొందరితో టచ్‌లో ఉంటూ, పైలట్‌ వర్గం భవిష్యత్‌ వ్యూహాలను తెలుసుకుంటోంది. 

కాంగ్రెస్‌ వ్యూహంలో భాగంగానే.. శనివారం సీఎం గహ్లోత్‌ అకస్మాత్తుగా గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాను కలిసి, బీటీపీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను చూపారు. కాంగ్రెస్‌(88), బీటీపీ(2), సీపీఎం(2), ఆర్‌ఎల్డీ(1), స్వతంత్రులు(10).. మొత్తం 103 మంది ఎమ్మెల్యేల మద్దతుందని గహ్లోత్‌ భావిస్తున్నారు. 

ఢిల్లీ నుంచి వచ్చిన అధిష్ఠానం దూతలు చక్రం తిప్పడంతో.. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ వ్యూహం మార్చారు. బలపరీక్షకు సిద్ధమయ్యారు. అదికూడా.. ఒక దెబ్బకు రెండు పిట్టలు రాలేలా..! సచిన్‌ పైలట్‌ సహా.. 19 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద వేటు వేశాక.. అసెంబ్లీని సమావేశపరిచి, బలపరీక్షను ఎదుర్కోవాలని నిర్ణయించారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల్లో.. 10 మం ది మద్దతునివ్వడం.. బీటీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు మద్ద తు లేఖలివ్వడం.. సీపీఎం, ఆర్‌ఎల్డీకి చెందిన చెరో ఎమ్మెల్యే బయటి నుంచి మద్దతుకు సిద్ధమవ్వడంతో.. గెహ్లోత్‌ సర్కారు గండం నుంచి గట్టెక్కిందని విశ్లేషకులు చెబుతున్నారు. 

నిజానికి గెహ్లోత్‌ సర్కారు నిలబడటానికి కావాల్సిన బలం ఉన్నా.. తన సర్కారును తొలినుంచీ ఇరకాటంలో పడేస్తున్న సచిన్‌, అతడి మద్దతుదారులకు గుణపాఠం చెప్పాలనే కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అది జరగాలంటే సోమవారం కోర్టులో విచారణ పూర్తవ్వాలి. మంగళవారం సాయంత్రం దాకా వేటువేయకూడదనే కోర్టు ఆదేశాలను పాటించాలి. కోర్టులో పైలట్‌ వర్గం వాదన ఏంటంటే.. రాజ్యాంగంలోని 10వ అధికరణ కింద తమకు నోటీసులు ఇవ్వడం సరికాదని చెబుతున్నారు.

గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాతో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ శనివారం దాదాపు ముప్పావు గంట పాటు సమావేశమైన విషయం తెలిసిందే. 200 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 107. ఇందులోపైలట్‌ సహా ఆయన వర్గం 19 మంది ఎమ్మెల్యేలు. ఈ పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే ల సహకారం లేకుండా, గహ్లోత్‌ విశ్వాస పరీక్షలో ఎలా నెగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ప్రభుత్వ కూల్చివేత కుట్రకు సంబంధించి బయటపడిన ఆడియో టేప్‌లు నిజమైనవేనని సీఎం గహ్లోత్‌ తేల్చి చెప్పారు.  బీజేపీ చెబుతున్నట్లు ఆ ఆడియో టేప్‌లు నకిలీవైతే.. రాజకీయాల నుంచి వైదొలగుతానన్నారు.  

అకస్మాత్తుగా విశ్వాస పరీక్షకు వెళ్లాలన్న ఆలోచన వెనుక, పైలట్‌ వర్గంలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలను వెనక్కు లాగే వ్యూహముందని పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి హైకోర్టు తీర్పు కూడా అనుకూలంగానే వస్తుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. అనర్హత విషయంలో హైకోర్టు ఎలాంటి తీర్పునిచ్చినా మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేలు తమకున్నారని ధీమాగా ఉంది.

యువ నాయకుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు చేయడంతో పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అలాగే, పార్టీ విప్‌ను ఉల్లంఘించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పైలట్‌ సహా 19 ఆయన వర్గం ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులను కూడా స్పీకర్‌ జారీ చేశారు. ఆ నోటీసులపై పైలట్‌ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు(సోమవారం) డివిజన్‌ బెంచ్‌ విచారణ జరపనుంది.

రాజస్థాన్‌లో అధికారం చేపట్టాలంటే.. అసెంబ్లీలో 200 మంది సభ్యులకుగాను.. 101 మంది మద్దతు అవసరం. కాంగ్రెస్‌కు సొంతంగా 107 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. సచిన్‌ పైలట్‌ సహా.. 19 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను మినహాయిస్తే.. ఆ పార్టీ బలం 88కి పడిపోతుంది. అయితే.. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల్లో 10 మంది మద్దతు గెహ్లోత్‌కు ఉంది. బీటీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారు. దాంతో.. కాంగ్రెస్‌ బలం 100కు చేరుకుంటుంది. తాజాగా.. ఆర్‌ఎల్డీ, సీపీఎంలకు చెందిన ఇద్దరు సభ్యులు కూడా గెహ్లోత్‌కు బయటి నుంచి మద్దతిస్తామని ప్రకటించారు. దీంతో.. కాంగ్రెస్‌ మద్దతు దారుల సంఖ్య మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే ఒకటి ఎక్కువగా ఉంటుంది. గెహ్లోత్‌ మాత్రం తమకు 109 మంది మద్దతు ఉందని చెబుతున్నారు. 

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   6 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   9 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   12 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   13 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   13 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle