newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బలపరీక్షపై బీజేపీ ధీమా.. ఎన్సీపీ ఎమ్మెల్యేలు చేజారకుండా వ్యూహాలు

26-11-201926-11-2019 13:19:37 IST
2019-11-26T07:49:37.236Z26-11-2019 2019-11-26T07:49:31.827Z - - 14-04-2021

బలపరీక్షపై బీజేపీ ధీమా.. ఎన్సీపీ ఎమ్మెల్యేలు చేజారకుండా వ్యూహాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సుప్రీంకోర్టు బుధవారం సాయంత్రం 5 గంటల లోపు బలనిరూపణ చేసుకోవాలని దేవేంద్ర ఫడ్నవీస్ ని ఆదేశించడంతో చకచకా అడుగులు వేస్తోంది బీజేపీ. ఇవాళ రాత్రి 9 గంటలకు బీజేపీ తన ఎమ్మెల్యేలతో మీటింగ్ నిర్వహించనుంది. బలనిరూపణ వ్యూహాలపై దేవేంద్ర ఫడ్నవీస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు.

బీజేపీకి చెందిన 105 ఎమ్మెల్యేలు ఇవాళ సాయంత్రం గార్వారె క్లబ్ వాంఖడే స్టేడియంకి రావాలని దేవేంద్ర ఫడ్నవీస్ సూచించారని బీజేపీ నేత రావ్ సాహెబ్ చెప్పారు. తమకు ఎన్సీపీకి చెందిన 54 మంది సభ్యులతో కలిపి మొత్తం 170 మంది సభ్యుల బలం ఉందని బీజేపీ అంటోంది.

ఇటు బలపరీక్షలో బీజేపీకి భంగపాటు తప్పదని కాంగ్రెస్, ఎన్సీపీ అంటున్నాయి. రాజ్యాంగ దినోత్సవం రోజున రాజ్యాంగానికి సరైన గౌరవం దక్కిందని, బలపరీక్షలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన గెలుపు ఖాయమన్నారు పృథ్వీరాజ్ చవాన్. బీజేపీ నిజస్వరూపం ఏంటో బుధవారం బయటపడుతుందన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేస్తే బావుంటుందని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. 

సత్యమే ఎప్పటికైనా గెలుస్తుందని శివసేన అభిప్రాయం వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పుని మైలురాయిగా అభివర్ణించారు నవాబ్. త్వరలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.

బీజేపీ నేతలు కూడా బలపరీక్షలో ఖచ్చితంగా గెలుస్తామని విశ్వాసంతో ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తామని బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ అన్నారు. బహిరంగ బ్యాలెట్ విధానంలో బలపరీక్ష జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రొటెం స్పీకర్ ద్వారా ప్రక్రియ పూర్తిచేయాలని, బలపరీక్ష ఒక్కటే ప్రధాన అజెండాగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే. 

 

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   21 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   an hour ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   3 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   4 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   21 hours ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   21 hours ago


ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle