newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బర్త్ డే పేరిట ఎంతో మంది జీవితాలను రిస్క్ లోకి నెట్టేసిన ఎమ్మెల్యే

11-04-202011-04-2020 09:44:37 IST
Updated On 11-04-2020 10:38:28 ISTUpdated On 11-04-20202020-04-11T04:14:37.733Z11-04-2020 2020-04-11T04:12:34.365Z - 2020-04-11T05:08:28.569Z - 11-04-2020

బర్త్ డే పేరిట ఎంతో మంది జీవితాలను రిస్క్ లోకి నెట్టేసిన ఎమ్మెల్యే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సామాజిక దూరం ద్వారానే కరోనా మహమ్మారిని దేశంనుంచి దూరంగా నెట్టేయగలం. అందుకే ప్రభుత్వాలు లాక్ డౌన్ పక్కాగా అమలు చేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్న వేళ, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ గుమికూడవద్దని, విందులు, వేడుకలు, వినోదాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వాలు కోరుతుంటే, ప్రజా ప్రతినిధులే దాన్ని పెడచెవిన పెడుతున్నారు.

తాజాగా కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే అట్టహాసంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుని ఎంతో మంది జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసి విమర్శలు కొనితెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తోంది. కరోనా కారణంగా 200 మంది మరణించారు.దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7,447 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది.

కర్నాటకలోని తుముకూరు జిల్లా తురువెకేరి ఎమ్మెల్యేగా ఉన్న ఎం జయరాం,తన పుట్టిన రోజు పార్టీని బ్రహ్మాండంగా జరుపుకున్నారు. చుట్టూ చేరిన చిన్నారులు, బంధువులు, మిత్రులు, అనుచరగణం మధ్య ఓ భారీ కేక్ ను ఆయన కట్ చేశారు. వీరంతా సామాజిక దూరాన్ని పాటించలేదు కదా... కిక్కిరిసి పోయి నిలబడివున్నారు. బెంగళూరుకు 90 కిలోమీటర్ల దూరంలోని గుబ్బి పట్టణంలో ఈ పార్టీ జరుగగా, వచ్చిన వారందరికీ బిర్యానీ పార్టీ ఇచ్చారు ఎమ్మెల్యే.

ఇక, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ, నిబంధనలు పాటించని జయరాంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ ను పాటించకుండా పార్టీలు చేసుకున్న ప్రజా ప్రతినిధుల్లో జయరాం మొదటి వ్యక్తేమీ కాదు. గత నెలలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, ఓ పెళ్లికి హాజరై విమర్శలు కొని తెచ్చుకోగా, ఆ మరుసటి రోజే, కాంగ్రెస్ వర్కర్లు, డీకే శివకుమార్ ఇచ్చిన పార్టీకి పెద్దఎత్తున హాజరయ్యారు. 

ప్రస్తుతం కర్ణాటకలో 200కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ ఆరుగురు మరణించగా, 34 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో చిన్నారులు ఉండటం వైద్యాధికారులను ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. ఇక లాక్ డౌన్ కొనసాగింపుపై, ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన తరువాత యడియూరప్ప తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రాజకీయనేతలకు, వీఐపీలకు లాక్ డౌన్ నిబంధనలు వర్తించవా అని కొందరు సామాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   6 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   9 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   12 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   12 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   13 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle