బడా రైతులు, భూస్వాముల దోపిడీకి చట్టబద్ధత- అగ్రో బిల్లులు
21-09-202021-09-2020 18:30:49 IST
Updated On 21-09-2020 21:00:37 ISTUpdated On 21-09-20202020-09-21T13:00:49.311Z21-09-2020 2020-09-21T13:00:47.133Z - 2020-09-21T15:30:37.588Z - 21-09-2020

ప్రజల, రైతుల, రాష్ట్రాల ప్రభుత్వాల వ్యతిరేకతలను ఖాతరు చేయకుండా కేంద్రం పార్లమెంటు ఆమోద ముద్ర వేయించుకున్న వ్యవసాయ బిల్లుల వల్ల బడా బడా రైతులు అంటే భూస్వాములు, బడా వ్యాపారుల దోపిడీని చట్టబద్ధం చేయడానికి వినా సామాన్యుల, రైతుల ప్రయోజనాలకు ఇసుమంతైనా దోహదం చేయదు. బడా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను భారీగా నిల్వ చేసుకోవడానికి ఈ బిల్లులు దోహదం చేస్తాయి. అంటే రాష్ట్రాల జాబితాలోని వ్యవసాయ మార్కెట్ రంగాలపై కేంద్రం తన పెత్తనాన్ని ఖరారు చేసుకుంది. అందుకే ఈ బిల్లును బీజేపీ యేతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వాలు లేని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆగ్రో బిల్లులు మూడు కూడా వ్యవసాయ రంగాన్ని మార్కెట్ కు అనుసంధానం చేయడానికి ఉద్దేశించినవే. అదే సమయంలో ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడిచేవే. కేంద్రానికి ఏకపక్షంగా గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టేవే. కరోనా వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్న సమయంలో కేంద్రం ఒకదాని తరువాత ఒకటిగా తన వివాదాస్పద నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించేందుకు తహతహలాడుతున్నది. ఆ తహతహలో భాగంగానే విపక్షాల వ్యతిరేకతను, అభ్యంతరాలనూ ఖాతరు చేయకుండా, సమగ్ర చర్చకు తావివ్వకుండా వ్యవసాయ బిల్లులకు పార్లమెంటులో ఆమోదముద్ర వేయించుకోవడం. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన అకాలీ దళ్ నుంచే తీవ్ర ప్రతిఘటన ఎదురైనా కేంద్రం ఖాతరు చేయలేదంటే... ఈ బిల్లుల విషయంలో కేంద్రం ఎంత తొందరపాటుతో వ్యవహరించిందో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ బిల్లును తేనె పూసిన కత్తిలా అభివర్ణించారు. పార్లమెంటులో కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లును తెరాస వ్యతిరేకించడం ఇదే మొదటి సారి. ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో తమ వ్యతిరేక గళాన్ని దీటుగా గట్టిగావినిపించారు. అయితే ఎవరి వ్యతిరేకతనూ, అభ్యంతరాలనూ ఖాతరు చేసే ఉద్దేశం లేనట్లుగా కేంద్రం బిల్లులకు పార్లమెంటు ఆమోదముద్రను వేయించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యవసాయ బిల్లులకు మద్దతుగా నిలబడింది. ఆ పార్టీ ఎంపీలు బిల్లుకు మద్దతు ప్రకటించారు. విద్యుత్ బిల్లుకు కూడా ఏపీ సర్కార్ వత్తాసు పలకడం ఇక్కడ ప్రత్యేకించి గమనార్హం. ఇక్కడ ఆ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ప్రజా ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నదని పరిశీలకులు చేస్తున్న విశ్లేషణలు హేతుబద్ధంగానే ఉన్నాయి.

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
3 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
5 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
8 minutes ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
7 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
7 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
an hour ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
8 hours ago

ఇక కేటీఆర్ టైం వచ్చినట్లేనా
9 hours ago

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
18-04-2021

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!
18-04-2021
ఇంకా