ఫలించనున్న భారతీయ సిక్కుల చిరకాల కల..!
09-11-201909-11-2019 09:38:50 IST
2019-11-09T04:08:50.555Z09-11-2019 2019-11-09T04:08:44.143Z - - 14-04-2021

భారతీయ సిక్కుల కల నెరవేరబోతోంది. తమ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకునే అవకాశం కలగబోతోంది. పాకిస్తాన్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారా దర్శనభాగ్యం కలగనుంది. ఇవాళ కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవంతో రోజుకు 5000 మంది భారతీయ సిక్కులు ఈ గురుద్వారాను దర్శించుకోనున్నారు. సిక్కులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే ఈ గురుద్వారాకు దేశవిభజన నాటి నుంచి భారతీయ సిక్కులు దూరంగా ఉండాల్సి వచ్చింది.
సిక్కుల మొదటి గురువు గురునానక్ తన జీవిత చరమాంకంలో 18 ఏళ్ల పాటు ఇక్కడ జీవించినట్లు చరిత్ర చెబుతోంది. దీంతో సిక్కులకు ఇది పవిత్ర క్షేత్రం.
దేశ విభజనకు ముందు ఈ గురుద్వారా పంజాబ్ రాష్ట్రంలో ఉండేది. దేశ విభజన తర్వాత పాకిస్తాన్ పంజాబ్‌లోని నరోవల్ జిల్లాలోకి కర్తార్‌పూర్ దర్బార్ సాహిబ్ గురుద్వారా వెళ్లింది. ఇది అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరం మాత్రమే.
అయినా, దేశ విభజన తర్వాత సిక్కులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం అసాధారణమైంది. అతితక్కువ మంది భారతీయ సిక్కులు మాత్రమే దర్శించగలిగారు. కర్తార్‌పూర్ దర్శించడం సిక్కులకు చిరకాల కోరికగా ఉండేది.
దీంతో వారు అంతర్జాతీయ సరిహద్దు వద్దకు వెళ్లి బైనాక్యులర్లతో ఈ గురుద్వారాను వీక్షించే వారంటే వారిలో తమ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనే ఆకాంక్ష ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దీంతో రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చి కర్తార్‌పూర్ కారిడార్ పేరుతో ఐదు కిలోమీటర్ల వారధి నిర్మించారు. రెండు దేశాల మధ్య ఉండే రావి నదిపై ఈ నిర్మాణం జరిగింది. ఏ దేశ ఆధీనంలో ఉండే భూభాగంలో ఆ దేశం ఖర్చుతో కారిడార్ నిర్మించారు. మన పంజాబ్‌లోని డేరా బాబా నానక్ గురుద్వారా నుంచి దర్బార్ సాహిబ్ గురుద్వారా వరకు ఐదు కిలోమీటర్ల మేర ఈ కారిడార్ ఉంది.
ఈ నెల 12న గురునానక్ 550 జయంతి ఉండటంతో ఈ కారిడార్‌ను ప్రారంభిస్తున్నారు. ఇవాళ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ కారిడార్ ప్రారంభిస్తున్నారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కనీసం ప్రధాని నరేంద్ర మోడీ విమానం కూడా పాక్ మీదుగా వెళ్లేందుకు ఆ దేశం అనుమతించడం లేదు. ఇటువంటి సమయంలో కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవం ఈ ఉద్రిక్త పరిస్థితులకు కొంత శాంతి వారధిగా కనిపిస్తోంది.
ఇవాళ భారత్ నుంచి మొదటి బృందం కర్తార్‌పూర్ వెళ్లనుంది. ఇందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్, మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు తదితరులు వెళ్లనున్నారు. భారత్ నుంచి వెళ్లే సిక్కులకు విసా కూడా అవసరం లేదు.
అయితే, ఉదయం వెళ్లి ఎట్టి పరిస్థితుల్లో రాత్రి వరకు తిరిగి భారత్ వచ్చేయాలనే నిబంధనలు పెట్టింది. దర్బార్ సాహిబ్ గురుద్వారా తప్ప ఇతర ఎక్కడా పర్యటించే అవకాశం ఉండదు. ఒక్కొక్కరి నుంచి 20 డాలర్లు వసూలు చేయాలని పాక్ ముందుగా నిర్ణయించింది. భారత్ ఆక్షేపించడంతో ఈ నిర్ణయంపై వెనక్కు తగ్గింది.

ఇదిలా ఉండగా కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి సంబంధించి పాక్ విడుదల చేసిన ప్రచార గీతంలో ఖలిస్థాన్ వేర్పాటువాదుల ఫోటోలు కనిపించడం విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఖలిస్థాన్ ఉద్యమానికి పాక్ వెన్నుగా నిలిచినందున ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు చేస్తుందా అనే అనుమానాలు సైతం ఉన్నాయి.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
a minute ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
an hour ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
2 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
2 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
4 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
6 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
6 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
21 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
20 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
21 hours ago
ఇంకా