ఫ్రాన్స్ నుంచి రయ్ రయ్‌మంటూ వస్తున్న రఫెల్ విమానాలు
27-07-202027-07-2020 12:11:11 IST
Updated On 27-07-2020 14:29:48 ISTUpdated On 27-07-20202020-07-27T06:41:11.872Z27-07-2020 2020-07-27T06:41:03.281Z - 2020-07-27T08:59:48.036Z - 27-07-2020

చైనాతో ఘర్షణ నేపథ్యంలో భారత్ అమ్ములపొది మరింత పదునెక్కనుంది. ఫ్రాన్స్ నుంచి రఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు బయలుదేరాయి. సోమవారం అవి భారత్ లో దిగనున్నాయి. తొలి దశలో 5 రఫెల్ యుద్ద విమానాలు వస్తున్నాయి. ఫ్రాన్స్‌లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి ఇవి భారత్‌కు బయలుదేరాయని తెలుస్తోంది. వీటి రాకతో భారత్ వైమానిక దళం మరింత పటిష్టం కానుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం టేకాఫ్ కానున్నాయి ఈ యుద్ధ విమానాలు.. అనంతరం బుధవారం అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోనున్నాయి. మార్గ మధ్యంలో అబుదాబి సమీపంలోని అల్-దాఫ్రా ఫ్రెంచ్ ఎయిర్‌బేస్ వద్ద ఆగుతాయి. తొలిదశ 5 విమానాలలో రెండు ట్రైనర్ విమానాలు, మూడు యుద్ధ విమానాలు ఉన్నట్లు వైమానికాధికారులు తెలిపారు. ఈ విమానాల కోసం భారత వైమానిక దళం ఆశగా ఎదురుచూస్తోంది. వీరి ఆశలు మరికొద్ది గంటల్లో నెరవేరనున్నాయి. జులై 27నాటికి ఈ విమానాలు భారత్‌కు అందుతాయని ఫ్రాన్స్ అధికారులు కొద్దినెలల ముందే హామీ ఇచ్చారకు. అదే సమయంలో ఫ్రాన్స్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లకు శిక్షణ కూడా కొనసాగుతోంది. విమానాలు రాగానే వాటిని వెంటనే వాడకంలో పెడతారు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ఉద్రిక్తతల వేళ ఫ్రాన్స్ ఈ విమానాలను భారత్‌కు వీలైనంత త్వరగా అందించేందుకు ప్రయత్నించింది. ఈ విమానాలకు చాలా చిన్న కాక్‌పిట్ ఉంటుందని.. ఈ కారణంగా ఏకధాటిగా పది గంటల పాటు ప్రయాణించడం కష్టమని, అందుకే మధ్యలో మిడిల్ ఈస్ట్‌లో ఆగి అక్కడే ఫ్యూయల్ నింపాక భారత్‌కు చేరుకుంటాయని సమాచారం. మరోవైపు ఫ్రెంచ్ ఎయిర్‌బేస్‌లో ఇప్పటికే ఏడుగురు భారత పైలట్లకు శిక్షణ పూర్తైంది. మరో బ్యాచ్‌కు శిక్షణ త్వరలో ఖరారు కానుంది. మొత్తం 36 రఫెల్ యుద్ధ విమానాల కోసం భారత్-ఫ్రాన్స్ మధ్య 2016 సెప్టంబర్లో ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయపరమయిన ఇబ్బందులు వచ్చినా సుప్రీంకోర్టు వాటికి క్లియరెన్స్ ఇచ్చింది.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
2 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
3 hours ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
2 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
4 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
5 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
5 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
22-04-2021
ఇంకా