ఫైజాబాద్ మళ్ళీ కమలానిదేనా?
05-05-201905-05-2019 09:16:06 IST
2019-05-05T03:46:06.412Z05-05-2019 2019-05-05T03:42:10.874Z - - 10-04-2021

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మీద దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ సీటు పరిధిలోనే అయోధ్య ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన లల్లూ సింగ్ గెలిచారు. ఆ తర్వాత 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫైజాబాద్ పరిధిలోని ఐదు అసెంబ్లీ సీట్లలో బీజేపీ గెలిచింది. కుల సమీకరణాల మీద రాజకీయం జరిగే ఈ నియోజకవర్గంలో బ్రాహ్మణులు, ఠాకూర్లదే రాజకీయంగా ఆధిపత్యం నడుస్తోంది. వీరితో పాటు సిట్టింగ్ ఎంపీ, ఠాకూర్ కులానికి చెందిన లల్లూ సింగ్, ఈసారి కూడా బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. ఆయనే మళ్ళీ గెలిచే అవకాశం ఉందని స్థానిక మీడియా చెబుతోంది. ఎందుకంటే, ఫైజాబాద్ అర్బన్ ఏరియాల్లో బీజేపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. అయితే రూరల్ ఏరియాల్లో ఓటింగ్ ఎలా ఉండే అవకాశం అన్నదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. సమాజ్ వాదీ పార్టీ నుంచి ఆనంద్ సేన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నుంచి నిర్మల్ ఖత్రి బరిలో ఉన్నారు. ముఖ్యంగా ఎస్పీలు, ముస్లింల ఓట్ బ్యాంక్ కీలకంగా మారనుందట. అయితే యాదవులు కాకుండా మిగిలిన ఓబీసీ కులాలు, జాదవ్ వర్గం మినహా మిగిలిన ఎస్పీ కులాల ఓట్లే అభ్యర్థుల మెజార్టీని నిర్ణయిస్తుందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈసారి పోటీ కేవలం బీజేపీ, ఎస్పీ మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఎస్సీల్లోని పాసిస్ సామాజిక వర్గం ఎస్పీ అభ్యర్థి ఆనంద్ సేన్ యాదవ్ మీద గుర్రుగా ఉందట. ఎందుకంటే, తమ కులానికి చెందిన అమ్మాయిని ఆనంద్ సేన్ యాదవ్, అత్యాచారం చేశాడనేది వారి అభియోగం. ఈ కేసులో ఆనంద్ సేన్ యాదవ్ క్లీన్ చీట్ పొందినా, పాసిస్ వర్గం మాత్రం ఆయన మీద కోపంతోనే ఉన్నారట. ఇక కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఈ అంశాన్నే ప్రధానంగా ప్రచారం చేస్తుండటంతో ఓట్లు ఎస్పీ, కాంగ్రెస్ మధ్య చీలడం ఖాయమని తెలుస్తోంది. ఈ ఓట్ల చీలికతో పాటు తమకు అండగా ఉన్న బ్రాహ్మణ, ఠాకూర్ ఓట్ బ్యాంకుతో సునాయాసంగా గెలుస్తామని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారట.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
7 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
3 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
5 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
10 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా