newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్రియాంక వారణాశిలో ఎందుకు పోటీచేయలేదంటే..?

09-05-201909-05-2019 15:21:40 IST
Updated On 29-06-2019 12:42:53 ISTUpdated On 29-06-20192019-05-09T09:51:40.792Z09-05-2019 2019-05-09T09:50:47.628Z - 2019-06-29T07:12:53.217Z - 29-06-2019

ప్రియాంక వారణాశిలో ఎందుకు పోటీచేయలేదంటే..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వార‌ణాసి నుంచి ప్రియాంక వాద్రా ఎందుకు పోటీ చేయ‌లేదో ఇప్పుడు త‌మ‌కు అర్థమైంది అంటున్నారు స్థానికి కాంగ్రెస్ నేత‌లు. నేరుగా ఈ విష‌యం చెప్పక పోయినా, స్థానిక మీడియాకు లీకులు ఇస్తున్నార‌ట‌. ఇంత‌కీ వారు చెప్పే విష‌యం ఏంటంటే, ఈ వార‌ణాసి నుంచి ప్రధాని మోడీ మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అజ‌య్ రాయ్ చేసిన కామెంట్లే, ప్రియాంక, రాహుల్ గాంధీల‌ను భ‌య‌పెట్టాయ‌ట‌. 

అజ‌య్ రాయ్ అభ్యర్థిగా డిక్లేర్ అవ్వక ముందు సొంత పార్టీ మీద తీవ్రమైన ఆరోప‌ణ‌లు చేశారట‌. అంతేకాదు, ఆయ‌న మాట్లాడిన వీడియో టేప్ మొత్తం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇంత‌కీ అజ‌య్ రాయ్ చేసిన ఆరోప‌ణ‌ల విష‌యానికొస్తే, త‌ల్లీకొడుకులు కాంగ్రెస్ పార్టీని నాశ‌నం చేస్తున్నార‌నేది మొద‌టి ఆరోప‌ణ‌. పార్టీలో ఆశ్రిత ప‌క్షపాతం, డ‌బ్బున్న వారిదే అధికారం అనేది రెండో ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఇక ప‌దేళ్ల యూపీఏ ప్రభుత్వాన్ని త‌ల్లీకొడుకులు రిమోట్ కంట్రోల్ ప్రభుత్వంగా మార్చేశారంటూ మ‌రో ప్రధాన ఆరోప‌ణ చేశారు అజ‌య్ రాయ్. 

ఈ మాట‌ల‌న్నీ ఆయ‌న ఎక్కడో అన‌లేదు. ఎన్నిక‌ల మీద ల‌క్నోలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కోర్ క‌మిటీ స‌మావేశంలో అన్న మాట‌లు అవి. ఈ వీడియోలో మ‌రో అంకం కూడా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్థానిక నేత‌ల దాకా అంద‌రూ త‌ప్పుగా ఆలోచిస్తూ, త‌ప్పుడు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని కూడా అజ‌య్ రాయ్ ఆరోపించారు. వార‌సుల‌కే అవ‌కాశం ఇస్తుంటే మ‌న పిల్లలు రాజ‌కీయంగా ఎప్పుడు ఎదుగుతారని ఆయ‌న ప్రశ్నించారు. 

అంతేకాదు, రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా చేశామ‌నీ, కానీ ఆయ‌న ఎప్పుడు ఏం మాట్లాడ‌తారో ఆయ‌న‌కే తెలీద‌ని కూడా కామెంట్ చేశారు. ఈ వీడియో అంద‌రి కంటే ముందుగానే రాహుల్, ప్రియాంక‌ల‌కు చేరింద‌ట‌. దీంతో భ‌య‌ప‌డిన వీరిద్దరూ వార‌ణాసి నుంచి పోటీకి వెనుకంజ వేశార‌ట‌. ఇదంతా ఓ ఎత్తయితే, తిట్టిన వ్యక్తికే టిక్కెట్ ఇచ్చి, చేతులు దులుపుకున్న కాంగ్రెస్ అధిష్టానం యూపీ కాంగ్రెస్ నేత‌లు జోకులు వేయ‌డం కొస‌మెరుపు.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle